'ఫ్లైయింగ్‌ ఫిన్‌' ఇక లేరు

27 Feb, 2021 19:12 IST|Sakshi

పారిస్‌: ర్యాలీ రేసింగ్‌లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించిన హన్నూ మికోలా కన్నుమూశాడు. ఫ్లైయింగ్‌ ఫిన్‌గా ప్రసిద్ధి పొందిన మికోలా(78) కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ శనివారం మరణించాడు. ఈ సందర్భంగా మికోలా మరణవార్తను అతని కుమారులు ట్విటర్‌ ద్వారా దృవీకరించారు. ' మీరు విన్నది నిజమే.. ఫ్లైయింగ్‌ ఫిన్‌ ఇక మనకు లేరు. ఈ చేదు వార్తను మీతో పంచుకోవడం బాధాకరం.' అంటూ ట్వీట్‌ చేశారు.


మికోలా తన కెరీర్‌ను వోల్వో కారుతో ప్రారంభించినా ఎక్కువభాగం ఫోర్డ్‌, ఆడీ కార్లతో రేసింగ్‌లో పాల్గొన్నాడు. టాప్‌ 10 ర్యాలీ డ్రైవర్స్‌లో ఒకడిగా పేరు పొందిన మికోలా 1979లో ప్రపంచ ర్యాలీ చాంపియన్‌షిప్‌లో రన్నరఫ్‌గా నిలవగా.. 1983లో ప్రపంచ ర్యాలీ రేస్‌ చాంపియన్‌షిప్‌ సాధించాడు. అతని మరణం పట్ల మాజీ ర్యాలీ చాంపియన్స్‌ కార్లోస్‌ సైంజ్‌, సెబాస్టియన్‌ ఓగిర్‌, పీటర్‌ సోల్డ్‌ బర్గ్‌లు తమ సానభూతి వ్యక్తం చేశారు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు