ఇప్పట్లో అది సాధ్యం కాదు: పీసీబీ చైర్మన్‌ రమీజ్‌ రాజా

14 Sep, 2021 07:52 IST|Sakshi

లాహోర్‌: మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రాజా సోమవారం పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడేళ్ల పాటు ఆయన పదవీకాలంలో ఉంటారు. ఎహ్‌సాన్‌ మని గత నెలలో పీసీబీ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో కొత్త చైర్మన్‌ను ఎన్నుకున్నారు. బోర్డు బాధ్యతలు రమీజ్‌కు కొత్తకాదు. 1992 వన్డే వరల్డ్‌కప్‌ విజేత పాక్‌ జట్టు సభ్యుడైన ఆయన 2003–2004 వరకు పీసీబీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. 59 ఏళ్ల రమీజ్‌ ఎన్నికైన వెంటనే భారత్, పాక్‌ ద్వైపాక్షిక సిరీస్‌పైనే స్పందించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిరకాల ప్రత్యర్థుల మధ్య సిరీస్‌ సాధ్యం కాదని తెలిపారు. 

చదవండి: Sourav Ganguly: ఆఖరి టెస్టుగానే ఆడదాం.. మరో సిరీస్‌గా అనుమతించం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు