Ranji Trophy 2022-23 Quarter Finals Day 2 Stumps: రంజీ ట్రోఫీ 2022-23 సీజన్లో గత రెండు రోజులుగా 4 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తొలి క్వార్టర్స్‌లో జార్ఖండ్-బెంగాల్, రెండో మ్యాచ్‌లో సౌరాష్ట్ర-పంజాబ్, మూడో మ్యాచ్‌లో ఉత్తరాఖండ్-కర్ణాటక, నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్ జట్లు అమీతుమీ తేల్చుకుంటున్నాయి. రెండో రోజు ఆటలో ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి వీరోచిత పోరాటం (మణికట్టు ఫ్రాక్చర్ అయినా లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్‌కు దిగాడు), కర్ణాటర ఆటగాడు శ్రేయస్ గోపాల్ సూపర్ సెంచరీ హైలైట్‌గా నిలిచాయి. ఆట ముగిసే సమయానికి స్కోర్ల వివరాలు ఇలా ఉన్నాయి..
తొలి క్వార్టర్ ఫైనల్ జార్ఖండ్ వర్సెస్ బెంగాల్.. 65 పరుగుల ఆధిక్యంలో బెంగాల్
రెండో క్వార్టర్ ఫైనల్ సౌరాష్ట్ర-పంజాబ్.. 24 పరుగుల ఆధిక్యంలో పంజాబ్
మూడో క్వార్టర్ ఫైనల్ ఉత్తరాఖండ్-కర్ణాటక.. 358 పరుగుల లీడ్‌లో కర్ణాటక
నాలుగో క్వార్టర్ ఫైనల్ ఆంధ్రప్రదేశ్-మధ్యప్రదేశ్.. 235 పరుగుల వెనుకంజలో మధ్యప్రదేశ్