దంచికొట్టిన రషీద్‌ ఖాన్‌.. ఆఖరి బంతికి విజయం

10 Jun, 2021 10:45 IST|Sakshi

అబుదాబి: యూఏఈ వేదికగా జరుగుతున్న పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌ 6)లో లాహోర్‌ క్యూలాండర్స్‌ ఇస్లామాబాద్‌ యునైటెడ్‌పై ఆఖరి బంతికి థ్రిల్లింగ్‌ విక్టరీ నమోదు చేసింది. ఆఖర్లో క్యూలాండర్‌ ఆటగాడు రషీద్‌ ఖాన్‌ 5 బంతుల్లో 15 పరుగులు(3 ఫోర్లు) మెరవడంతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమైన దశలో షాబాద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో రషీద్‌ మూడు వరుస బంతుల్లో ఫోర్లు బాది ఒత్తిడి తగ్గించాడు. అనంతరం నాలుగో బంతికి రెండు పరుగులు తీసిన రషీద్‌ ఖాన్‌.. ఐదో బంతికి సింగిల్‌ తీశాడు. ఆఖరి బంతికి ఒక్క పరుగు కావాల్సిన దశలో టిమ్‌ డేవిడ్‌ సింగిల్‌ తీయడంతో క్యూలాండర్స్‌ పీఎస్‌ఎల్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. అంతకముందు బౌలింగ్‌లో 4 ఓవర్లు వేసి 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ తీసిన రషీద్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. 

మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఇస్లామాబాద్‌ యునైటెడ్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఫహీమ్‌ అష్రఫ్‌ 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. క్యూలాండర్స్‌ బౌలింగ్‌లో జేమ్స్‌ ఫాల్కనర్‌ 3 వికెట్లతో రాణించాడు. అనంతరం క్యులాండర్స్‌ 5 వికెట్లకు 144 పరుగులు చేసింది. కెప్టెన్‌ సోహైల్‌ అక్తర్‌ 40 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా గతేడాది నవంబర్‌లో కరోనా మహమ్మారితో వాయిదా పడిన పీఎస్‌ఎల్‌-6 ఇటీవలే యూఏఈ వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే.
చదవండి: జాతి వివక్ష: చిక్కుల్లో పడిన మోర్గాన్‌, బట్లర్‌

'రషీద్‌ పెళ్లెప్పుడు'.. ఎందుకు మీరు వస్తారా?

మరిన్ని వార్తలు