Ravi Shastri On Sports Betting: "భారత్‌లో బెట్టింగ్‌ను చట్ట బద్ధం చేస్తే.." టీమిండియా మాజీ కోచ్‌ సంచలన వ్యాఖ్యలు

24 Dec, 2021 13:42 IST|Sakshi

Ravi Shastri Calls For Legalisation Of Sports Betting: టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి బెట్టింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్‌​లో స్పోర్ట్స్ బెట్టింగ్‌ను చట్ట బద్ధం చేస్తే దేశ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నాడు. ఇలా చేయడం వల్ల బెట్టింగ్‌పై నిఘా పెట్టే వీలు కూడా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తాజాగా జరిగిన మీడియా కార్యక్రమంలో ఆయన మాట్లడుతూ..

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలు బెట్టింగ్‌కు చట్ట బద్ధత కల్పించాయని.. భారత్‌లో కూడా అలా చేస్తే పన్ను రూపేనా భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుందని అన్నాడు. దేశంలో స్పోర్ట్స్​ బెట్టింగ్ చాలా కాలంగా జోరుగా సాగుతుందని, ముఖ్యంగా క్రికెట్​పై భారీ స్థాయిలో బెట్టింగ్​లు నడుస్తాయని, మరి ముఖ్యంగా ఐపీఎల్ సీజన్‌లో వందల కోట్లలో చేతులు మారుతుంటాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

బెట్టింగ్‌ను అణచివేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగముండదని, ఇందుకు చట్ట బద్ధత కల్పించడమే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డాడు. రవి చేసిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మరోసారి హాట్‌ టాపిక్‌గా మారాయి. రవిశాస్త్రి కంటే ముందు పలువురు ప్రముఖులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐపీఎల్​లో మ్యాచ్​ ఫిక్సింగ్​ కుంభకోణంపై విచారణ జరిపిన కమిటీకి నేతృత్వం వహించిన విశ్రాంత జస్టిస్​ ముకుల్ ముద్గల్ కూడా ఇదే విషయాన్ని కేంద్రానికి సూచించారు.

ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌-2021 అనంతరం కోచింగ్‌ బాధ్యతల నుంచి వైదొలిగిన రవిశాస్త్రి.. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్‌-2022లో ఓ ప్రముఖ జట్టు తరఫన కీలక బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.   
చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా మనీశ్‌ పాండే..?
 

మరిన్ని వార్తలు