కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియాకు కప్‌ లేదు.. బాధగా ఉంది

12 Nov, 2021 21:08 IST|Sakshi

Ravi Shastri Disoppointment Team India Not Winning ICC Trophy..  టీమిండియా హెడ్‌ కోచ్‌గా రవిశాస్త్రి ఇటీవలే తప్పుకున్న సంగతి తెలిసిందే.  టి20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా ఆట సూపర్‌ 12లోనే ముగియడంతో ఆయన సేవలు అక్కడితో ముగిశాయి. అయితే టీమిండియాకు కోచ్‌గా పనిచేయడం తన అదృష్టమని రవిశాస్త్రి ఇప్పటికే పేర్కొన్నాడు. తాజాగా తాను కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా కప్‌ సాధించకపోవడంతో ఏదో వెలితిగా ఉందని పేర్కొన్నాడు. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌తో జరిగిన ఇంటర్య్వూలో రవిశాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు.

చదవండి: Rohit-Rahane: రోహిత్‌, రహానే.. మనకు తెలియకుండా ఇన్ని పోలికలా!

''టీమిండియా హెడ్‌కోచ్‌గా ఐదేళ్ల ప్రయాణంలో ఎన్నో అద్భుతాలు చూశా. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై వరుసగా రెండు టెస్టు సిరీస్‌ల్లో ఓడించడం ఎన్నటికి మరిచిపోను. దాదాపు 70 సంవత్సరాలు తర్వాత ఇలాంటి ఫీట్‌ నమోదు చేయడం సంతోషం కలిగించింది.  అంతేగాక ఇటీవలే ఇంగ్లండ్‌ గడ్డపై జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తేడాతో ఆధిక్యంలో ఉండడం కూడా ఒక గొప్ప ఎచీవ్‌మెంట్‌గా చెప్పుకోవచ్చు. కోచ్‌ ఉన్న ఈ ఐదేళ్లలో టీమిండియా బైలెటరల్‌ సిరీస్‌లు ఎన్నో గెలిచింది. కానీ ఒక్కటి మాత్రం తీరలేదు. నా హయాంలో టీమిండియా ఆడిన మూడు ఐసీసీ టోర్నీల్లో ఒక్కసారి కూడా కప్‌ గెలవలేకపోవడం బాధ కలిగించింది. అయితే ఈ మూడు సందర్భాల్లో టీమిండియా ప్రదర్శన గొప్పగానే ఉండడం విశేషం. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో గ్రూప్‌ టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టిన టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్‌తో ఓడిపోయింది. ఇక ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ అదే ఫలితం పునరావృతం అయింది. తాజాగా టి20 ప్రపంచకప్‌ 2021లో మరోసారి నిరాశే ఎదురైంది. ఇదొక్కటి మినహాయిస్తే మిగతావన్ని సక్రమంగానే జరిగాయి'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Ravi Shastri: గంగూలీతో విభేదాలు నిజమే.. కోచ్‌ పదవి నుంచి వైదొలిగాక సంచలన వ్యాఖ్యలు

>
మరిన్ని వార్తలు