-

Virat Kohli- James Anderson: రవిశాస్త్రి ఏం జరిగినా పట్టించుకోడు

25 Aug, 2021 10:32 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా విజయం తర్వాత ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం హైలెట్‌ అయ్యాయి. బుమ్రా- అండర్సన్‌, అండర్సన్‌- కోహ్లి వివాదాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా మూడో టెస్టుకు సిద్ధమవుతున్న ఇంగ్లండ్‌ వివాదాల జోలికి పోమని.. మ్యాచ్‌ విజయంపై దృష్టి పెట్టనున్నట్లు కెప్టెన్‌ రూట్‌ ఇప్పటికే తెలిపాడు. కాగా రూట్‌ కెప్టెన్సీపై విమర్శలు చేసిన ఆ జట్టు మాజీ ఆటగాడు నాసర్‌ హుస్సేన్‌ భారత ప్రధాన కోచ్‌ రవిశాస్త్రిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

''రవిశాస్త్రి మైదానంలో ఏం జరిగినా పట్టించుకోడు. కోహ్లి- అండర్సన్‌ల మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రత్యక్షంగా చూసినప్పటికి దానిని పట్టించుకోలేదు. కోహ్లిని ఒక కెప్టెన్‌గా మాత్రమే చూశాడు. అండర్సన్‌తో వివాదం కానీ.. బాల్కనీ నుంచి ఆటగాళ్లకు సైగలు చేయడం వంటివి చేసినా రవిశాస్త్రి అతన్ని వేలెత్తి చూపలేదు. అయితే ఇందులో కెప్టెన్‌గా కోహ్లికి ఎక్కువ పాత్ర ఉంది అని చెప్పుకొచ్చాడు.  కాగా టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య నేటి నుంచి లీడ్స్‌ వేదికగా మూడో టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్‌ 1-0 ఆధిక్యంలో ఉంది.

చదవండి: Team India Next Head Coach: టీమిండియా తదుపరి కోచ్‌ అతడేనా?

Mark Boucher: 'నా ప్రవర్తనకు సిగ్గుపడుతున్నా.. క్షమించండి'

మరిన్ని వార్తలు