అశ్విన్‌ 11వ సారి.. అక్షర్‌ రెండో బౌలర్‌గా

25 Feb, 2021 19:49 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లు అరుదైన రికార్డు సాధించారు. ముందుగా అక్షర్‌ పటేల్‌ విషయానికి వస్తే .. మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన అతను రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు వికెట్లను పడగొట్టాడు. ఓవరాల్‌గా ఒక మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 11 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఒక డే నైట్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అక్షర్‌(11/70) తొలి స్థానంలో నిలిచాడు. ఆసీస్‌కు చెందిన పాట్‌ కమిన్స్‌( 10/62)తో రెండో స్థానంలో.. విండీస్‌ స్పిన్నర్‌ దేవేంద్ర బిషో(10/174)తో మూడో స్థానంలో ఉన్నాడు. అంతేగాక ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ దక్కించుకున్న ఆటగాడిగా అక్షర్‌ ఏదో స్థానంలో.. టీమిండియా నుంచి రెండో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. భారత్‌ నుంచి తొలి ఆటగాడిగా అశ్విన్‌ ఉన్నాడు. 

ఇక రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్టుల్లో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ను  అవుట్‌ చేయడం ఇది 11వ సారి కావడం విశేషం. ఒక బ్యాట్స్‌మెన్‌ను ఇన్నిసార్లు అవుట్‌ చేయడంలో అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. ఇంతకముందు డేవిడ్‌ వార్నర్‌ను 10 సార్లు, అలిస్టర్‌ కుక్‌ను 9 సార్లు, జేమ్స్‌ అండర్సన్‌, ఎడ్‌ కోవాన్‌లు ఏడేసి సార్లు అశ్విన్‌ బౌలింగ్‌లో అవుటయ్యారు. ఇక్కడ ఇంకొక వింత ఏంటంటే.. వీరంతా లెఫ్ట్‌ హ్యాండర్‌ బ్యాట్స్‌మెన్‌ కావడం విశేషం.
చదవండి: ఆర్చర్‌ ఔట్‌, రికార్డు సృష్టించిన అశ్విన్‌
38 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ చెత్త రికార్డు

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు