Pujara-Ashwin: 'ఇలా అయితే ఎలా.. బౌలింగ్‌ జాబ్‌ వదిలేయాలా?'

13 Mar, 2023 18:01 IST|Sakshi

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రా కావడంతో ట్రోఫీ వరుసగా నాలుగోసారి టీమిండియా వద్దే ఉండిపోయింది. ఇక అటు తొలి టెస్టులో న్యూజిలాండ్‌ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్‌ బెర్తుకు లైన్‌ క్లియర్‌ అయింది. 

ఈ విషయం పక్కనబెడితే నాలుగో టెస్టులో చివరి రోజు చివరి సెషన్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.  మ్యాచ్‌ ఎలాగూ డ్రా అవుతుందనే ఉద్దేశంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బౌలింగ్‌తో ప్రయోగాలు చేశాడు. బ్యాటర్లుగా ముద్రపడిన ఆటగాళ్లతో బౌలింగ్‌ చేయించాడు. మొదట శుబ్‌మన్‌ గిల్‌ ఇన్నింగ్స్‌ 77వ ఓవర్‌ వేయగా.. ఇన్నింగ్స్‌ 78వ ఓవర్‌ టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా చేత వేయించాడు.

కాగా రైట్‌ ఆర్మ్‌ లెగ్‌బ్రేక్‌ బౌలర్‌ అయిన పుజారా కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్ల బౌలింగ్‌ కూడా సరిగ్గా పడని పిచ్‌పై పుజారా అద్బుతంగా బౌలింగ్‌ చేశాడు. దీంతో పుజారా బౌలింగ్‌పై అశ్విన్‌ తనదైన శైలిలో ఫన్నీగా స్పందించాడు. ''ఇప్పుడు నేనేం చేయాలి.. బౌలింగ్‌ జాబ్‌ వదిలేయాలేమో'' అంటూ కామెంట్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: IND VS Aus 4th Test: అశ్విన్‌, విరాట్‌ ఖాతాలో రికార్డులు

శెభాష్‌.. ఓడించినంత పనిచేశారు... మరేం పర్లేదు! అసలైన మజా ఇదే!

మరిన్ని వార్తలు