Ravindra Jadeja: పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకున్నావా.. ఫైరూ.. ఫొటో వైరల్‌.. తగ్గేదేలే అన్న బన్నీ!

13 Jan, 2022 08:46 IST|Sakshi
PC: Ravindra Jadeja Instagram

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ట్రెండ్‌ను బట్టి ఎప్పటికప్పుడు వీడియోలు పోస్ట్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. ఇక ఇప్పటికే అల్లు అర్జున్‌  ‘పుష్ప’ మూవీ ట్రాన్స్‌లో పడిపోయిన జడ్డూ భాయ్‌... ''పుష్ప.. పుష్పరాజ్‌.. దీనమ్మ తగ్గేదే లే..''  అంటూ డైలాగ్‌ చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు. తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్‌తో ముందుకు వచ్చాడు. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ లుక్‌ను రీక్రియేట్‌ చేసి ఆశ్చర్యపరిచాడు.

‘‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకున్నావా.. ఫైరూ..’’ అంటూ నోట్లో బీడీతో మాస్‌ లుక్‌తో సర్‌ప్రైజ్‌ చేశాడు. అయితే.. ఇది కేవలం గ్రాఫికల్‌ రిప్రజెంటేషన్‌ మాత్రమేనని, సిగరెట్‌, బీడీ, పొగాకు సేవనం ఆరోగ్యానికి హానికరం అనే నోట్‌తో సామాజిక బాధ్యతను చాటుకున్నాడు.  ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘‘టాలీవుడ్‌ నీకోసం ఎదురుచూస్తోంది జడ్డూ భాయ్‌.. ఏయ్‌ బిడ్డా.. ఇది జడ్డూ కా అడ్డా’’ అంటూ తెలుగు నెటిజనం కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా జడ్డూ పోస్టుపై స్పందించాడు. ‘‘తగ్గేదేలే’’ అంటూ ఫైర్‌ ఎమోజీలను జతచేశాడు. కాగా జడేజా గాయం కారణంగా దక్షిణాఫ్రికా టూర్‌కు దూరమైన సంగతి తెలిసిందే. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక గబ్బర్‌ శిఖర్‌ ధావన్‌ సైతం పుష్పరాజ్‌గా మారి అభిమానులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

చదవండి: Jasprit Bumrah Vs Marco Jansen: బుమ్రాతో వైరం.. ఫలితం అనుభవించాడు

A post shared by Ravindrasinh jadeja (@ravindra.jadeja)

మరిన్ని వార్తలు