ఆర్సీబీ ‘సూపర్‌ విన్‌’

28 Sep, 2020 23:52 IST|Sakshi

దుబాయ్‌: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ‘సూపర్‌’ విక్టరీని నమోదు చేసింది. సూపర్‌ ఓవర్‌కు దారి తీసిన మ్యాచ్‌లో ఆర్సీబీ విజయకేతనం ఎగురవేసింది. సూపర్‌ ఓవర్‌లో ముంబై ఇండియన్స్‌ వికెట్‌ కోల్పోయి 7 పరుగులే చేసింది. ముంబై తరఫున హార్దిక్‌ పాండ్యా, పొలార్డ్‌లు ఓపెనింగ్‌కు దిగారు. సైనీ వేసిన సూపర్‌ ఓవర్‌ తొలి బంతికి పొలార్డ్‌ పరుగు తీయగా,రెండో బంతికి పాండ్యా మరో పరుగు సాధించాడు. మూడు బంతికి ఎటువంటి పరుగు రాలేదు. నాల్గో బంతికి పొలార్డ్‌ ఫోర్‌ కొట్టగా, ఐదో బంతికి ఔటయ్యాడు. ఆరో బంతికి బై రూపంలో పరుగు రావడంతో ఆర్సీబీకి ముంబై ఎనిమిది పరుగుల మాత్రమే నిర్దేశించింది. ముంబై తరఫున బుమ్రా సూపర్‌ ఓవర్‌ వేయగా, ఆర్సీబీ తరఫున ఏబీ డివిలియర్స్‌, విరాట్‌ కోహ్లిలు ఓపెనింగ్‌కు వచ్చారు. వీరిద్దరూ చివరి బంతికి ఎనిమిది పరుగులు సాధించడంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది. చివరి బంతిని కోహ్లి ఫోర్‌ కొట్టి విజయాన్ని అందించాడు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన  ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది.  ఆర్సీబీ స్టార్‌ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌, శివం దూబేలు మెరుపులు మెరిపించారు. స్లాగ్‌ ఓవర్లలో వీరిద్దరూ ధాటిగా ఆడటంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. డివిలియర్స్‌ 24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు చేశాడు. కోహ్లి ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన డివిలియర్స్‌ భారీ షాట్లతో  అలరించాడు. ఈ క‍్రమంలోనే  23 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. బుమ్రా, బౌల్ట్‌ వంటి బౌలర్లున్నా 360 డిగ్రీల ఆటతో అదరగొట్టాడు. ఆఖరి ఓవర్‌లో దూబే(27 నాటౌట్‌; 10 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు) బ్యాట్‌ ఝుళిపించడంతో ఆర్సీబీ 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. అంతకుముందు అరోన్‌ ఫించ్‌(52; 35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), దేవదూత్‌ పడిక్కల్‌(54; 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి ఆరంభాన్ని అందించారు.ముంబై ఇండియన్స్‌-ఆర్సీబీల మ్యాచ్‌ టైగా ముగిసింది.ఇషాన్‌ కిషన్‌(99; 58 బంతుల్లో 2 ఫోర్లు, 9 సిక్స్‌లు), పొలార్డ్‌(60 నాటౌట్‌; 24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగడంతో మ్యాచ్‌ టై అయ్యింది. 20 ఓవర్‌ చివరి బంతికి ఐదు పరుగులు చేయాల్సిన దశలో పొలార్డ్‌ ఫోర్‌ కొట్టాడు. దాంతో స్కోరు సమం అయ్యింది. దాంతో సూపర్‌ ఓవర్‌ తప్పలేదు. ఈ ఉత్కంఠ పోరులో ఆర్సీబీ నవ్వగా, ముంబైకు చుక్కదురైంది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు