IPL 2021 Second Phase: బ్లూ జెర్సీలో ఆర్సీబీ.. మ్యాచ్‌ తర్వాత ఏం చేస్తారంటే..?

18 Sep, 2021 21:16 IST|Sakshi

RCB Blue Jersey 2021: ఐపీఎల్‌ రెండో విడతలో భాగంగా ఈ నెల 20న అబుదాబి వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)తో జరిగే మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఎరుపు రంగు జెర్సీకి బదులు బ్లూ కలర్ జెర్సీని ధరించి బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే. కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి  సంఘీభావంగా ఆర్సీబీ ఆటగాళ్లు నీలం రంగు జెర్సీలను ధరించనున్నారు. ఫ్రంట్‌లైన్ యోధులు ధరించే పీపీఈ కిట్‌ల రంగును పోలివుండే బ్లూ జెర్సీని ధరించడం గర్వకారణం అని పేర్కొన్న ఆర్సీబీ బృందం.. మ్యాచ్‌ అనంతరం ఆ జెర్సీలను వేలం వేస్తామని, వచ్చిన డబ్బులను దేశవ్యాప్తంగా ఉచిత వ్యాక్సిన్ల పంపిణీకి వినియోగిస్తామని వెల్లడించింది. 

కాగా, 2011 ఐపీఎల్‌ నుంచి ఏదో ఒక మ్యాచ్‌లో కోహ్లి సేన ఆకుపచ్చ రంగు జర్సీలను ధరిస్తూ వచ్చింది. పర్యావరణం పట్ల అవగాహణ పెంపొందించేందుకు ఆకుపచ్చ జెర్సీలను ధరించేది. ఐపీఎల్ ఫేజ్-1 సమయంలో కూడా మే 3న కేకేఆర్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో బ్లూ జెర్సీలో కనిపించబోతున్నట్లు ఆర్సీబీ ప్రకటించింది. అయితే, కరోనా కారణంగా ఐపీఎల్ ఆర్ధంతరంగా వాయిదా పడడంతో ఇప్పుడా బ్లూ జెర్సీను ధరించనున్నారు. ఇదిలా ఉంటే, ఫేజ్-1లో రాయల్ ఛాలెంజర్స్ మొదటి ఏడు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 


చదవండి: బీసీసీఐ, కోహ్లి మధ్య అగాధం.. అందుకే ఆ నిర్ణయం..!

మరిన్ని వార్తలు