ఆర్సీబీ ఔట్‌.. కోహ్లి ఎమోషనల్‌ ట్వీట్‌!

7 Nov, 2020 11:06 IST|Sakshi

అబుదాబి: ఐపీఎల్‌ 13 వ సీజన్‌లో తొలి అర్ధభాగం అద్భుత విజయాలు సాధించిన రాయల్‌​ చాలెంజర్స్‌ జట్టు ఇంటిదారిపట్టింది. శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ సందర్భంగా ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ట్విటర్‌ వేదికగా ఎమోషనల్‌ వీడ్కోలు సందేశం ఇచ్చాడు. ఐపీఎల్‌ 2020 లో జట్టు సభ్యులమంతా ఒడిదుడుకులను తట్టుకుని మెరుగైన ప్రదర్శన చేశామని పేర్కొన్నాడు. జట్టుగా తమకు ఇది గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చాడు.
(చదవండి: విన్‌రైజర్స్‌...)

అయితే, ఆర్సీబీకి కొన్ని పరిస్థితులు అనుకూలించలేదని కోహ్లి వాపోయాడు. ఏదేమైనా టీమ్‌ సభ్యులు, సిబ్బంది సహకారం మరువలేనిదని అన్నాడు. తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కోహ్లి కృతజ్ఞతలు చెప్పాడు. అభిమానుల ఆదరణతో మరింత బలం పుంజుకుని మళ్లీ కలుస్తానని సెలవు ప్రకటించాడు. టీమ్‌ సభ్యులు, సహాయక సిబ్బందితో కూడిన ఫొటోను కోహ్లి ట్విటర్‌లో షేర్‌ చేశాడు. కాగా, మేటీ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఆర్సీబీ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్‌ సీజన్‌లోనూ విజేతగా నిలవలేదు. 
(చదవండి: సుదీర్ఘ కాలం ‘బయో బబుల్‌’లో కష్టమే)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు