DC Vs MI: ఊహించని ట్విస్ట్‌; మనం ఒకటి తలిస్తే దేవుడు మరోలా..

22 May, 2022 11:02 IST|Sakshi
PC: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో శనివారం ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో పెద్దగా రాణించలేదు. 14 మ్యాచ్‌ల్లో 4 విజయాలు.. 10 ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడగున నిలిచింది. ముంబై ఆటతీరుతో విసిగెత్తిపోయిన ఫ్యాన్స్‌ ఆ జట్టు ఆడుతున్న మ్యాచ్‌లు చూడడం మానేశారు. అయితే శనివారం జరిగిన మ్యాచ్‌ను మాత్రం చాలామంది వీక్షించారు. దానికి కారణం లేకపోలేదు. 

ఈ మ్యాచ్‌ ముంబై కంటే ఆర్‌సీబీకి కీలకం. ఆర్‌సీబీ ప్లే ఆఫ్‌ చేరాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ కచ్చితంగా ఓడిపోవాల్సిందే. అందుకు ముంబై ఇండియన్స్‌కు ఆర్‌సీబీ ఫ్యాన్స్‌ సపోర్ట్‌ ఇచ్చారు. మ్యాచ్‌ ముంబై, ఢిల్లీకి జరుగుతున్నప్పటికి ఆర్‌సీబీ.. ఆర్‌సీబీ.. ఆర్‌సీబీ అంటూ స్టేడియంలో నినాదాలు చేయడం చూస్తే.. ఆ జట్టుకు ఉన్న క్రేజ్‌ తెలిసిపోతుంది. ఫ్యాన్స్‌ మాత్రమే కాదు.. ఆర్‌సీబీ ఆటగాళ్లు కూడా తమ క్యాంప్‌లో టీవీ ముందు కూర్చొని మ్యాచ్‌ను వీక్షిస్తూ ముంబై  గెలవాలని కోరుకున్నారు. అన్నట్లుగానే ముంబై ఇండియన్స్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ఆర్‌సీబీని దగ్గరుండి ప్లే ఆఫ్స్‌ పంపించింది.

అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మంచి ఇన్నింగ్స్‌తో గెలిపిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ రోహిత్‌ మళ్లీ అదే ఆటతీరుతో నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకున్నాడు. 2 పరుగులు మాత్రమే చేసి నోర్ట్జే బౌలింగ్‌లో శార్దూల్‌ ఠాకూర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఎవరు ఊహించని రీతిలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఆర్‌సీబీ ప్లే ఆఫ్‌ చేరడంలో పరోక్షంగా సాయపడ్డాడు.

'
PC: IPL Twitter
టిమ్‌ డేవిడ్‌ ఔట్‌ విషయంలో పంత్‌ రివ్యూ తీసుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంచినట్లయింది. గోల్డెన్‌ డక్‌ నుంచి తప్పించుకున్న టిమ్‌ డేవిడ్‌ 11 బంతుల్లో 34 పరుగులు(4 సిక్సర్లు, 2 ఫోర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఒక రకంగా పంత్‌ ఆర్‌సీబీ పాలిట దేవుడయ్యాడు. రోహిత్‌ కాపాడతాడనుకుంటే అనూహ్యంగా పంత్‌ పేరు తెరమీదకు వచ్చింది.. ''కాదు..కాదు వచ్చేలా చేసుకున్నాడు''.

ముంబై మ్యాచ్‌ గెలవడంపై క్రికెట్‌ అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్‌ చేశారు.'' ఆర్‌సీబీకి అదృష్టం బాగుంది.. మనం ఒకటి తలిస్తే.. దేవుడు మరోలా తలిచాడు.. ఆర్‌సీబీ పాలిట దేవుడు రోహిత్‌ కాలేదు.. పంత్‌ అయ్యాడు అంటూ కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా క్రికెట్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో మీమ్స్‌, ట్రోల్స్‌తో రెచ్చిపోయారు. వాటిపై ఒక లుక్కేయండి.

చదవండి: Rishabh Pant-IPL 2022: విలన్‌గా మారిన పంత్‌.. ఆ రివ్యూ తీసుకొని ఉంటే

Poll
Loading...
మరిన్ని వార్తలు