స్మిత్‌,ఊతప్పల జోరు.. ఆర్‌సీబీ లక్ష్యం 178

17 Oct, 2020 17:48 IST|Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌13వ సీజన్‌లో ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన రాబిన్‌ ఊతప్ప (41: 22 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌) జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(57: 36 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌) అర్థసెంచరీతో మెరవగా, జోస్‌ బట్లర్‌(24 25 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు. కాగా రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో 100 పరుగులు దాటింది.  స్మిత్‌, బట్లర్‌లు కలసి 58  పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  చాహల్‌ వేసిన 18వ ఓవర్లో 3 ఫోర్లు బాదిన స్మిత్‌ 17 రన్స్‌ రాబట్టాడు. ఈ క్రమంలోనే 30 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే స్మిత్‌ అవుటయ్యాడు. కాగా 19వ ఓవర్లో రాహుల్‌ తెవాటియా ఫోర్‌, సిక్సర్‌తో15 పరుగులు సాధించడంతో ఆర్‌ఆర్‌  గౌరవప్రదమైన స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లలో చాహల్‌(2/34), క్రిస్‌ మోరీస్‌(4/26) రాజస్థాన్‌ను దెబ్బకొట్టారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు