IPL 2022: ఆర్సీబీ ఓపెనర్లు వీరే.. క్లూ ఇచ్చిన యాజమాన్యం

3 Mar, 2022 17:02 IST|Sakshi

RCB Posts Photo Of Virat Kohli With Du Plessis: ఐపీఎల్ 2022 సీజన్‌ ప్రారంభానికి కొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు జట్టు సారధిని ప్రకటించని రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఓపెనర్ల విషయంలో మాత్రం క్లూ ఇచ్చింది. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి జతగా సౌతాఫ్రికా వెటరన్‌ బ్యాటర్‌ డుప్లెసిస్‌ను బరిలోకి దించాలని ఆ జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తమ అధికారిక ట్విటర్‌ వేదికగా ఓ క్లూను కూడా విడుదల చేసింది. 


పిక్చర్ ఫ్రమ్‌ ఫ్యూచర్‌, తమ స్టార్ ఆటగాళ్లను జతగా చూడాలని ఆతృతగా ఉందని క్యాప్షన్‌ జోడించి ఆర్సీబీ జెర్సీలో ఉన్న కోహ్లి, డుప్లెసిస్‌ల మార్ఫింగ్‌ ఫోటోను షేర్‌ చేసింది. నెట్టింట వైరలవుతున్న ఈ ఫోటోను చూసిన అభిమానులు కోహ్లి, డుప్లెసిస్‌లే ఆర్సీబీ ఓపెనింగ్‌ పెయిర్‌ అని కన్ఫర్మ్‌ చేసుకుంటున్నారు. తొలుత డుప్లెసిస్‌కు జతగా యువ ఓపెనర్ అనూజ్ రావత్‌ను ఆడిస్తారని ప్రచారం జరిగినా.. ఆర్సీబీ తాజా ట్వీట్‌తో కోహ్లినే ఇన్నింగ్స్ ప్రారంభించడం దాదాపుగా ఖరారైంది. 

కాగా, మెగా వేలానికి ముందు కోహ్లి, మ్యాక్స్‌వెల్‌, సిరాజ్‌లను రీటైన్‌ చేసుకున్న ఆర్సీబీ.. వేలంలో డుప్లెసిస్‌ను రూ. 7 కోట్లకు దక్కించుకుంది. గత సీజన్‌ తర్వాత కోహ్లి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఈ సీజన్‌ నుంచి డుప్లెసిస్‌ను కెప్టెన్ చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. గతేడాది ఐపీఎల్‌లో రుతురాజ్‌ (635) తర్వాత రెండో అత్యధిక స్కోరర్‌గా నిలిచిన డుప్లెసిస్‌ (633)పై ఆర్సీబీ భారీ అంచనాలే పెట్టుకుంది. ఈ నెల 26 నుంచి మే 29 వరకు ధనాధన్ లీగ్ జరగనుంది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: ఫాఫ్ డుప్లెసిస్(రూ.7కోట్లు), అనూజ్ రావత్(రూ.3.4 కోట్లు), విరాట్ కోహ్లి(రూ.15 కోట్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు), దినేశ్ కార్తీక్(కీపర్)(రూ.5.5 కోట్లు), మహిపాల్ లోమ్రార్(రూ.95 లక్షలు), వనిందు హసరంగా(రూ.10.75 కోట్లు), షాబాజ్ అహ్మద్(రూ.2.4 కోట్లు), హర్షల్ పటేల్(రూ.10.75 కోట్లు), జోష్ హెజెల్ వుడ్(రూ.7.75 కోట్లు), మహ్మద్ సిరాజ్(రూ.7 కోట్లు), ఆకాశ్ దీప్ సింగ్‌(రూ.20 లక్షలు), సిద్దార్థ్ కౌల్(రూ.75 లక్షలు), కర్ణ్ శర్మ(రూ.50 లక్షలు), ఫిన్ అలెన్(రూ. కోటి), జేసన్ బెహ్రెన్‌డార్ఫ్(రూ.75 లక్షలు), డేవిడ్ విల్లే(రూ.2 కోట్లు), ప్రభుదేశాయ్(రూ.30 లక్షలు), లువిత్ సిసోడియా(రూ.20 లక్షలు), చామ మిలింద్(రూ.25 లక్షలు), అనీశ్వర్ గౌతమ్(రూ.20 లక్షలు)
చదవండి: 'వంద టెస్టులు ఆడతానని ఊహించలేదు'

మరిన్ని వార్తలు