IPL 2021: ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కీలక ప్రకటన

11 Oct, 2021 12:39 IST|Sakshi
PC: RCB Twitter

RCB releases Wanindu Hasaranga and Dushmantha Chameera: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కీలక ప్రకటన చేసింది. శ్రీలంక ఆటగాళ్లు వనిందు హసరంగ, దుష్మంత చమీరాను బయో బబుల్‌ నుంచి విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. టీ20 వరల్డ్‌కప్‌ (T20 World Cup) జట్టులో భాగమైన వీరిద్దరు క్వాలిఫైయర్స్‌ నేపథ్యంలో... శ్రీలంక జట్టుతో కలవనున్నట్లు పేర్కొంది. ఈ సందర్భంగా హసరంగ, చమీరాకు ఆర్సీబీ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పింది. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌లో భాగంగా నేడు(అక్టోబరు 11) కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడనున్న నేపథ్యంలో ఆర్సీబీ ఈ మేరకు ప్రకటన చేయడం గమనార్హం. 

ఇక... కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌-2021 సీజన్‌ పునః ప్రారంభమయ్యే నాటికి ఆడం జంపా, డేనియల్‌ సామ్స్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఫిన్‌ అలెన్‌, వాషింగ్టన్‌ సుందర్‌ వివిధ కారణాలతో బెంగళూరు జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. వనిందు హసరంగ, దుష్మంత చమీరా, జాన్జ్‌ గార్టన్‌, టిమ్‌ డేవిడ్‌, ఆకాశ్‌ దీప్‌ వంటి ఆటగాళ్లు ఆర్సీబీలో ఎంట్రీ ఇచ్చారు. ఇక శ్రీలంక క్రికెటర్లలో హసరంగ రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క వికెట్‌ కూడా తీయకపోగా... చమీరాకు అసలు ఆడే అవకాశమే రాలేదు.

చదవండి: CSK Vs DC: అతడితో 19వ ఓవర్‌ వేయించాల్సింది.. ఆ నిర్ణయం తప్పు: గంభీర్‌

శ్రీలంక టీ20 ప్రపంచకప్‌ జట్టు:
దసున్‌ షనక(కెప్టెన్‌), ధనంజయ డి సిల్వా(వైస్‌ కెప్టెన్‌), కుశాల్‌ పెరీరా, దినేశ్‌ చండిమాల్‌, భనుక రాజపక్స, చరిత్‌ అసలంక, అవిష్క ఫెర్నాండో, పాథమ్‌ నిసాంక, వనిందు హసరంగ, మహేశ్‌ తీక్షణ, అకిల ధనుంజయ, చమిక కరుణరత్నే, లహిరు కుమార, దుష్మంత చమీరా, బిరున ఫెర్నాండో.

మరిన్ని వార్తలు