విరాట్‌ కోహ్లి కెప్టెన్సీ ఇన‍్నింగ్స్‌

10 Oct, 2020 21:18 IST|Sakshi

దుబాయ్‌:  ఐపీఎల్‌లో భాగంగా సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 170 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. దేవదూత్‌ పడిక్కల్‌(33; 34 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌), విరాట్‌ కోహ్లి( 90 నాటౌట్‌; 52 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు),  శివం దూబే( 22 నాటౌట్‌;  14 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌)లు రాణించడంతో పోరాడే స్కోరును బోర్డుపై ఉంచారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆర్సీబీ ఆదిలోనే అరోన్‌ ఫించ్‌(2) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో దేవదూత్‌ పడిక్కల్‌, విరాట్‌ కోహ్లిలు జట్టు స్కోరును చక్కదిద్దారు. ఈ జోడి 53 పరుగులు జోడించిన తర్వాత పడిక్కల్‌ ఔటయ్యాడు.(చదవండి: వాటే మ్యాచ్‌.. కేకేఆర్‌ విన్నర్‌)

అటు తర్వాత ఏబీ డివిలియర్స్‌ డకౌట్‌ కాగా, వాషింగ్టన్‌(10) కూడా నిరాశపరిచాడు. శార్దూల్‌ ఠాకూర్‌ తన పదునైన బంతులతో పడిక్కల్‌, డివిలియర్స్‌లను ఒకే ఓ‍వర్‌లో ఔట్‌ చేసి మంచి బ్రేక్‌ ఇచ్చాడు. వాషింగ్టన్‌ సుందర్‌.. సామ్‌ కరాన్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. కాగా, కోహ్లి కడవరకూ క్రీజ్‌లో ఉండటంతో పాటు శివం దూబే( 23)లు బ్యాట్‌ ఝుళిపించడంతో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. సీఎస్‌కే బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ రెండు వికెట్లు సాధించగా, సామ్‌ కరాన్‌, దీపక్‌ చాహర్‌లకు తలో వికెట్‌ లభించింది.

ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను పడిక్కల్‌, ఫించ్‌లు మెల్లగా ఆరంభించారు. కాగా, చాహర్‌ మూడో ఓవర్‌ ఐదో బంతికి ఫించ్‌ పెవిలియన్‌ చేరాడు. దాంతో ఆర్సీబీ 13 పరుగుల వద్ద తొలి వికెట్‌ను చేజార్చుకుంది. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కోహ్లి చివరి వరకూ క్రీజ్‌లో ఉండాలనే తపనతో పెద్దగా షాట్లకు వెళ్లకుండా స్టైక్‌ రొటేట్‌ చేశాడు. కాగా, ఈ క్రమంలోనే కోహ్లి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 39 బంతుల్లో అర్థ శతకం సాధించాడు. అయితే స్లాగ్‌ ఓవర్లలో కోహ్లి బ్యాట్‌ ఝుళిపించి స్కోరులో వేగం పెంచాడు. ఓ దశలో ఆర్సీబీ 150 పరుగులు చేరడమే కష్టంగా కనిపించినా కోహ్లి బ్యాటింగ్‌ మెరుపులతో గౌరవప్రదమైన స్కోరు చేసింది ఆర్సీబీ.(చదవండి: ‘గేల్‌ను తీసుకోకుండా మళ్లీ తప్పు చేశారు’)

మరిన్ని వార్తలు