RCB: ఆర్‌సీబీకి షాక్‌.. ట్విటర్‌ను కూడా వదల్లేదు

22 Jan, 2023 13:18 IST|Sakshi

ఐపీఎల్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన జట్టుగా రాయల్‌ చాలెంజర్స్‌  బెంగళూరుకు పేరుంది. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న జట్టు కూడా ఆర్‌సీబీనే. అలాంటి ఆర్‌సీబీ ట్విటర్‌ను హ్యాక్‌ చేయడం సంచలనం కలిగించింది. శనివారం (జనవరి 21) ఉదయం 4 గంటల సమయంలో అకౌంట్ హ్యాక్ చేసినట్లు ఆర్సీబీ ప్రకటించింది. హ్యాకర్లు ప్రొఫైల్ నేమ్‌ని ‘బోర్డ్ ఏప్ యాచ్ క్లబ్’గా మార్చారు. ప్రొఫైల్ పిక్‌గా కార్టూన్ ఇమేజ్ పెట్టారు. అకౌంట్ బయోలో ఎన్‌ఎఫ్‌టీ గురించి అప్డేట్ చేయడంతో పాటు దానికి సంబంధించిన కొన్ని ట్వీట్లను పోస్ట్ చేశారు.

ఆర్‌సీబీ ట్విటర్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2021లో కూడా ఈ టీమ్ ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది.ఆర్‌సీబీ ట్విటర్ ఖాతాలను రెండుసార్లు హ్యాక్ చేసిన హ్యాకర్లు.. ఆగస్టు 2022లో ఆర్‌సీబీ యూట్యూబ్‌ చానెల్‌ను కూడా హ్యాక్ చేశారు. ప్రస్తుతం ట్విట్టర్ ఖాతాని తిరిగి పునరుద్దరించినట్లు ఆర్సీబీ ప్రకటించింది.

చదవండి: రెజ్లర్ల మీటూ ఉద్యమం.. క్రీడాశాఖ కీలక నిర్ణయం

'టీమిండియా రైట్‌ ట్రాక్‌లోనే వెళ్తుందా?'.. మీకేమైనా అనుమానమా!

మరిన్ని వార్తలు