RCB VS SRH: ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం..

6 Oct, 2021 18:24 IST|Sakshi

ఉత్కంఠ పోరులో ఆర్సీబీపై ఎస్‌ఆర్‌హెచ్‌ విజయం..
చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 4పరుగుల తేడాతో విజయం సాధించింది. 142 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నీర్ణీత 20 ఓవర్లలో 137 పరుగలకే పరిమితమైంది. చివర వరకు డివిలియర్స్‌ క్రీజులో ఉన్న బెంగళూరును గెలిపించ లేకపోయాడు. ఆర్సీబీ బ్యాట్సమన్‌లో మాక్స్‌వెల్(40),  పడిక్కల్ (41) ఆద్బుతంగా రాణించారు. అఖరి ఓవర్‌లో 13 పరుగుల కావల్సిన నేపథ్యంలో భువనేశ్వర్ కుమార్ 9 పరుగులే ఇచ్చి హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు. 

అంతక ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ నీర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానకి 141 పరుగులు చేసింది.  ఆరంభం ఆదిరినా మిడిలార్డర్‌ చేతలు ఎత్తేయడంతో 141 పరుగులకే సన్‌రైజర్స్‌ పరిమితమైంది. ఆరంభంలోనే అభిషేక్ శర్మ వికెట్‌ కోల్పోయినప్పటికి కెప్టెన్‌ విలియమ్సన్(31) జాసన్‌ రాయ్‌(44)  ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. విలియమ్సన్ ఔటయ్యక హైదరాబాద్‌ వికెట్ల పతనం మొదలైంది. ఆర్సీబీ  బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా, డేనియల్‌ క్రిస్టియన్‌ రెండు వికెట్లు, యజ్వేంద్ర చహల్, జార్జ్ గార్టన్ చెరో వికెట్‌ సాధించారు

ఐదో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. పడిక్కల్ (41) ఔట్‌
కీలక సమయంలో ఆర్సీబీ పడిక్కల్ వికెట్‌ కోల్పోయింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పడిక్కల్ (41) సమద్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఆర్సీబీ 18ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్(10), డివిలియర్స్(12) ఉన్నారు.

నాలగో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. మాక్స్‌వెల్(40) ఔట్‌
స్కోర్‌ 92 పరుగుల వద్ద మంచి ఊపు మీద ఉన్న మాక్స్‌వెల్ , రషీద్ ఖాన్ బౌలింగ్‌లో   విలియమ్సన్‌ సూపర్‌ త్రో కు రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 25 బంతుల్లో 4ఫోర్లు,  2సిక్స్‌లతో 40 పరుగులు చేశాడు. కాగా ప్రస్తుతం ఆర్సీబీ 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. క్రీజులో దేవదత్ పడిక్కల్(38), ఎబి డివిలియర్స్(5) ఉన్నారు. కాగా విజయానికి 23 బంతుల్లో 37 పరుగలు కావాలి

మూడో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. శ్రీకర్ భరత్(12)ఔట్‌
142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ తడబడతుంది. కేవలం 37 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్(12) వృద్ధిమాన్ సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకు ముందు  సిద్దార్థ్ కౌల్ బౌలింగ్‌లో క్రిస్టియన్(1) పరుగుకే  విలియమ్సన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. కాగా ప్రస్తుతం 8 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో దేవదత్ పడిక్కల్(23), గ్లెన్ మాక్స్‌వెల్(7) ఉన్నారు.

ఆర్సీబీకు బిగ్‌ షాక్‌.. కోహ్లి(5) ఔట్‌
142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఆదిలోనే కెప్టెన్‌ కోహ్లి వికెట్‌ కోల్పోయింది. కేవలం 5 పరుగులు చేసి ​​‍కోహ్లి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఎల్బీ‍గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 2 ఓవర్లలో ఆర్సీబీ వికెట్‌ నష్టానికి 13 పరుగులు చేసింది. క్రీజులో దేవదత్ పడిక్కల్ (7), డేనియల్ క్రిస్టియన్(0) ఉన్నారు

ఆర్సీబీ టార్గెట్‌ 142 పరుగులు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ నీర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానకి 141 పరుగులు చేసింది.  ఆరంభం ఆదిరినా మిడిలార్డర్‌ చేతలు ఎత్తేయడంతో 141 పరుగులకే సన్‌రైజర్స్‌ పరిమితమైంది. ఆరంభంలోనే అభిషేక్ శర్మ వికెట్‌ కోల్పోయినప్పటికి  కెప్టెన్‌ విలియమ్సన్(31) జాసన్‌ రాయ్‌(44)  ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. విలియమ్సన్ ఔటయ్యక హైదరాబాద్‌ వికెట్ల పతనం మొదలైంది. ఆర్సీబీ  బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టగా, డేనియల్‌ క్రిస్టియన్‌ రెండు వికెట్లు, యజ్వేంద్ర చహల్, జార్జ్ గార్టన్ చెరో వికెట్‌ సాధించారు.

2 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు.. అబ్దుల్‌ సమద్‌(1) ఔట్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ 107/5
ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు 2 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. డేనియల్‌ క్రిస్టియన్‌ వేసిన 15వ ఓవర్లో ప్రియం గార్గ్‌, జేసన్‌ రాయ్‌ వికెట్లు కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. చహల్‌ వేసిన మరుసటి ఓవర్‌ తొలి బంతికే(15.1 ఓవర్‌) అబ్దుల్‌ సమద్‌(1) వికెట్‌ కూడా సమర్పించుకుంది. 15.1 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 107/5. క్రీజ్‌లో సాహా, హోల్డర్‌ ఉన్నారు.

ఒకే ఓవర్లో 2 వికెట్లు.. జేసన్‌ రాయ్‌(44) ఔట్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ 107/4
డేనియల్‌ క్రిస్టియన్‌ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ఎస్‌ఆర్‌హెచ్‌ను దారుణంగా దెబ్బకొట్టాడు. 14వ ఓవర్‌ తొలి బంతికి ప్రియం గార్గ్‌ను అవుట్‌ చేసిన క్రిస్టియన్‌.. అదే ఓవర్‌ ఆఖరి బంతికి జేసన్‌ రాయ్‌(38 బంతుల్లో 44; 5 ఫోర్లు)ని కూడా పెవిలియన్‌కు పంపాడు. 15 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 107/4. క్రీజ్‌లో అబ్దుల్‌ సమద్‌(1), సాహా ఉన్నారు.

ప్రియం గార్గ్‌(15) ఔట్‌.. ఎస్‌ఆర్‌హెచ్‌ 105/3
డేనియల్‌ క్రిస్టియన్‌ వేసిన 14 ఓవర్లో ప్రియం గార్గ్‌(11 బంతుల్లో 15; సిక్సర్‌) ఔటయ్యాడు. ఏబీ డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 14.1 ఓవర్ల తర్వాత ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోర్‌ 105/3. క్రీజ్‌లో జేసన్‌ రాయ్‌(43), అబ్దుల్‌ సమద్‌ ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన  ఎస్‌ఆర్‌హెచ్‌.. విలియమ్సన్(31) ఔట్‌
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కెప్టెన్‌ విలియమ్సన్(31) ‍ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది.  ప్రస్తుతం క్రీజులో  జాసన్ రాయ్(22), ప్రియం గార్గ్(3) పరుగులతో ఉన్నారు.

నిలకడగా ఆడుతున్న ఎస్‌ఆర్‌హెచ్‌..
ఆరంభంలోనే అభిషేక్ శర్మ వికెట్‌ కోల్పోయినప్పటికి ఎస్‌ఆర్‌హెచ్‌ ప్రస్తుతం నిలకడగా ఆడుతుంది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ కోల్పోయి  ఎస్‌ఆర్‌హెచ్‌ 58 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేన్ విలియమ్సన్(20), జాసన్ రాయ్(22) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఎస్‌ఆర్‌హెచ్‌.. అభిషేక్ శర్మ(13) ఔట్‌
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ శర్మ రూపంలో  సన్‌రైజర్స్ తొలి వికెట్‌ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ సెకెండ్‌ ఓవర్‌ వేసిన జార్జ్ గార్టన్ బౌలింగ్‌లో.. ఓపెనర్‌గా వచ్చిన  అభిషేక్ శర్మ(13) మాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 3 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌  వికెట్‌ నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజులో కేన్ విలియమ్సన్(8), జాసన్ రాయ్(1) పరుగులతో ఉన్నారు.

అబుదాబి: ఐపీఎల్‌2021 సెకెండ్‌ ఫేజ్‌లో భాగంగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఐపీఎల్‌లో తమ 100 వ విజయాన్ని నమోదు చేసుకోవడానకి  బెంగళూరు తహ తహ లాడుతుంటే.. హైదరాబాద్‌ మాత్రం ఎలాగైనా గెలిచి పరువు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తోంది.

ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో రెండు జట్లు 19 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. హైదరాబాద్ 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా..  బెంగళూరు 11 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇక మిగిలిన ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. కాగా ప్రస్తుత సీజన్‌ తొలి దశలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో  6 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాదించింది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్‌ కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్

సన్‌రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్‌), జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్‌ కీపర్‌), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, సిద్దార్థ్ కౌల్

మరిన్ని వార్తలు