శార్దూల్‌,హజిల్‌వుడ్‌లు ఔట్‌

25 Oct, 2020 15:18 IST|Sakshi
ఎంఎస్‌ ధోని వర్సెస్‌ విరాట్‌ కోహ్లి(కర్టసీ; బీసీసీఐ)

దుబాయ్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందుగా బ్యాటింగ్‌కు మొగ్గుచూపాడు ఈ సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె మ్యాచ్‌లో ఆర్సీబీ 37 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఇప్పటివరకూ ఇరుజట్ల మధ్య ఓవరాల్‌గా 25 మ్యాచ్‌లు జరగ్గా సీఎస్‌కే 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ]

ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆడిన గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించగా, ఒకదాంట్లో  ఓడింది. మరొకవైపు సీఎస్‌కే గత ఐదు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించి, నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఇసురు ఉదాన స్థానంలో మొయిన్‌ అలీని జట్టులోకి తీసుకున్నారు. స్పిన్నర్‌ ఆల్‌రౌండర్‌ కావడంతో మొయిన్‌ అలీకి అవకాశం ఇచ్చినట్లు కోహ్లి తెలిపాడు. ఇక సీఎస్‌కే తుది జట్టులోకి సాంత్నార్‌, మోను కుమార్‌ జట్టులోకి వచ్చారు. జోష్‌ హజిల్‌వుడ్‌, శార్దూల్‌ ఠాకూర్‌లకు విశ్రాంతి ఇచ్చారు.

ఇరుజట్లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో డుప్లెసిస్‌(376-సీఎస్‌​కే), విరాట్‌ కోహ్లి(365-ఆర్సీబీ), దేవదూత్‌ పడిక్కల్‌(321-ఆర్సీబీ), ఏబీ డివిలియర్స్‌(285- ఆర్సీబీ), షేన్‌ వాట్సన్‌(285-సీఎస్‌కే)లు వరుసగా ఉన్నారు. ఇక ఇరుజట్ల అత్యధిక వికెట్ల జాబితాలో యజ్వేంద్ర చహల్‌(15-ఆర్సీబీ), సామ్‌ కరాన్‌(10-సీఎస్‌కే), దీపక్‌ చాహర్‌(10-సీఎస్‌కే), శార్దూల్‌ ఠాకూర్‌(9-సీఎస్‌కే), క్రిస్‌ మోరిస్‌(9-ఆర్సీబీ)లు వరుస స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇప్పటికే సీఎస్‌కే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి ఔట్‌ కావడంతో కనీసం పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. మరొకవైపు ఆర్సీబీ ప్లేఆఫ్‌ స్థానాన్ని పదిలం చేసుకోవడానికి బరిలోకి దిగుతోంది.ఆర్సీబీ ఇప్పటివరకూ 10 మ్యాచ్‌లు ఆడి 7 విజయాలు సాధించగా, సీఎస్‌కే 11 మ్యాచ్‌లకు 3 మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. 

సీఎస్‌కే
ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, అంబటి రాయుడు, జగదీశన్‌, డుప్లెసిస్‌, సామ్‌ కరాన్‌, రవీంద్ర జడేజా, మిచెల్‌ సాంత్నార్‌, దీపక్‌ చాహర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, మోను కుమార్‌

ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌, ఏబీ డివిలియర్స్‌, మొయిల్‌ అలీ, గుర్‌కీరత్‌ సింగ్‌ మన్‌, క్రిస్‌ మోరిస్‌, వాషింగ్టన్‌ సుందర్‌, సైనీ, సిరాజ్‌, చహల్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు