ఐపీఎల్‌ 2020: సిరాజ్‌కు చాన్స్‌

5 Oct, 2020 19:14 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. ముందుగా ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటివరకూ ఇరు జట్లు నాలుగేసి మ్యాచ్‌లు తలో మూడు మ్యాచ్‌లు గెలిచాయి. ఆర్సీబీ-ఢిల్లీలు ఒకదాంట్లో మాత్రమే ఓటమి చెందడంతో ఈ మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా దూరమయ్యాడు.  గాయం కారణంగా మిశ్రా వైదొలిగాడు. అమిత్‌ మిశ్రా స్థానంలో అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి వచ్చాడు.

మరొకవైపు హైదరాబాద్‌ బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ఆర్సీబీ తుది జట్టులోకి తీసుకుంది. అదే సమయంలో ఆడమ్‌ జంపా స్థానంలో మొయిన్‌ అలీ వచ్చాడు. ఆర్సీబీ తన గత మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌పై విజయం సాధించగా, కేకేఆర్‌తో ఆడిన గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ గెలుపును అందుకుంది. ఓవరాల్‌గా ఇప్పటివరకూ ఇరు జట్ల మధ్య 24 మ్యాచ్‌లు జరగ్గా ఆర్సీబీ 15 మ్యాచ్‌ల్లో ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఒకదాంట్లో ఫలితం తేలలేదు.

ఆర్సీబీ జట్టులో విరాట్‌ కోహ్లి, దేవదూత్‌ పడిక్కల్‌, ఏబీ డివిలియర్స్‌లు మంచి ఫామ్‌లో ఉండగా, బౌలింగ్‌లో విభాగంలో యజ్వేంద్ర చహల్‌ మ్యాజిక్‌ చేస్తున్నాడు. గత మ్యాచ్‌లో కోహ్లి ఫామ్‌లోకి రావడంతో ఆర్సీబీ టాపార్డర్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో బలం పెరిగింది. ఫించ్‌, దేవదూత్‌లు మంచి ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని అందిస్తే కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ భారీ స్కోరు నమోదు చేసే అవకాశం ఉంది.  ఇక ఢిల్లీ జట్టులో కెప్టెన్‌ శ్రేయస్‌, పృథ్వీషాలు చెలరేగిపోతున్నారు. రిషభ్‌ పంత్‌ కూడా ఫర్వాలేదనిపిస్తున్నాడు. పేస్‌ బౌలింగ్‌లో నోర్త్‌జే మరోసారి కీలకం కానున్నాడు.

ఆర్సీబీ
విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), దేవదూత్‌ పడిక్కల్‌, అరోన్‌ ఫించ్‌, ఏబీ డివిలియర్స్‌, శివం దూబే, వాషింగ్టన్‌ సుందర్‌, ఇసుర ఉదాన, సిరాజ్‌, నవదీప్‌ సైనీ, చహల్‌, మొయిన్‌ అలీ

ఢిల్లీ
 శ్రేయస్‌ అయ్యర్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, రిషభ్‌ పంత్‌, హెట్‌మెయిర్‌, మార్కోస్‌ స్టోయినిస్‌, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, కగిసో రబడా, నోర్త్‌జే, హర్షల్‌ పటేల్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు