సిరాజ్‌, కుల్దీప్‌ల గొడవ.. నిజమెంత!

6 Feb, 2021 17:45 IST|Sakshi

చెన్నై: టీమిండియా క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌ల మధ్య డ్రెస్సింగ్‌ రూమ్‌లో గొడవ జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. వివరాలు.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటిరోజు సెషన్‌ ముగిసిన తర్వాత భారత క్రికెటర్లను అభినందించడానికి సిరాజ్‌ డ్రెస్సింగ్ రూమ్‌ డోర్‌ వద్ద నిల్చున్నాడు. అతని పక్కనే టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కూడా ఉన్నాడు.

జట్టును మొత్తం అభినందించిన సిరాజ్‌.. కుల్దీప్‌ రాగానే అతన్ని ఆపి మెడ పట్టుకొని గొడవ పడుతున్నట్లుగా వీడియోలో కనిపించింది. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు తుది జట్టులో చోటు దక్కించుకోకపోవడంతో కుల్దీప్‌, సిరాజ్‌లు విరామం సమయంలో డ్రింక్స్‌ అందించారు. లంచ్‌ సెషన్‌ తర్వాత అశ్విన్‌కి కాసేపు సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వెళ్లిన సిరాజ్.. ఆ తర్వాత మైదానం వెలుపలికి వచ్చినా.. డ్రింక్స్ బాయ్‌గా బాధ్యతలు నిర్వర్తించలేదు. ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందా అన్న సందేహం వ్యక్తమయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్‌ చేశారు. మేం చూస్తున్నది నిజమేనా.. కుల్దీప్‌, సిరాజ్‌లకు ఏమైంది.. ఎందుకు అలా గొడవ పడుతున్నారు.. ఇదంతా ఫేక్‌.. సిరాజ్‌ కావాలనే కుల్దీప్‌తో గొడవ పడుతున్నట్లుగా నటించాడు.. అంటూ కామెంట్లు చేశారు. 

వాస్తవానికి సిరాజ్‌, కుల్దీప్‌ల మధ్య ఎటువంటి గొడవ చోటుచేసుకోలేదు. తుది జట్టులో ఇద్దరికి చోటు లేకపోవడంతో ఉదయం నుంచి డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే గడిపిన వీరిద్దరు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. అయితే టీ విరామం సమయంలో సిరాజ్‌ కుల్దీప్‌తో గొడవ పడుతున్నట్లుగా యానిమేటర్‌ వీడియో ద్వారా చిన్న తమాషా చేశాడు.వీడియోలో చూస్తే సిరాజ్‌ కుల్దీప్‌ను సీరియస్‌గా ఏదో అంటున్నట్లు కనిపిస్తుంది.కుల్దీప్‌కు మొదట సిరాజ్‌ చర్య అర్థం కాకపోయినా.. అతని‌ తీరు చూసి భయపడినట్లుగా వీడియో కనిపించింది. పైగా వీరిద్దరు గొడవ పడుతున్న సమయంలో రవిశాస్త్రి అక్కడే ఉండడం.. వీరిని చూసి కూడా ఏమి పట్టనట్లు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇదంతా‌ కావాలని చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా టీమిండియా ఇంగ్లండ్‌ సిరీస్‌ను మంచి ఎంటర్‌టైనింగ్‌ మూడ్‌లోనే నడిపిస్తుంది. రిషబ్‌ పంత్‌, రోహిత్‌ శర్మలే అనుకుంటే సిరాజ్‌ వారిని మించి ఎంటర్‌టైన్‌ చేయడంలో సఫలమయ్యాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే మొదటి టెస్టులో ఇంగ్లండ్‌ భారీ స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. 8 వికెట్ల నష్టానికి 555 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ముగించింది. కెప్టెన్‌ జో రూట్‌ డబుల్‌ సెంచరీ(218)తో ఆకట్టుకోగా, స్టోక్స్‌ 82 పరుగులతో రాణించాడు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా బౌలర్లు అశ్విన్‌ ఒక వికెట్‌ తీయగా, నదీం, ఇషాంత్‌ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక 263 పరుగుల వద్ద పర్యాటక జట్టు తొలి రోజు ఆటను ముగించిన సంగతి తెలిసిందే. 

ఇంగ్లండ్‌ స్కోరు: బర్న్స్‌ (సి) పంత్‌ (బి) అశ్విన్‌- 33; సిబ్లీ (ఎల్బీ) (బి) బుమ్రా- 87; లారెన్స్‌ (ఎల్బీ) (బి) బుమ్రా- 0; రూట్ (ఎల్బీ) (బి) నదీం- 218; స్టోక్స్  (సి) పుజారా (బి) నదీం-82; పోప్‌ (ఎల్బీ) (బి) అశ్విన్‌- 34; బట్లర్‌ (బి) ఇషాంత్‌- 30; ఆర్చర్‌ (బి) ఇషాంత్‌- 0; బెస్‌ (బ్యాటింగ్‌)- 28; జాక్‌ లీచ్‌(బ్యాటింగ్‌)- 6. మొత్తం 555 (8 వికెట్లు, 180 ఓవర్లు) 

చదవండి: 
పంత్ బంతి ఎక్కడుంది.. ఎటు పరిగెడుతున్నావు
నిన్న హెల్మెట్‌తో ఫీల్డింగ్‌.. ఇవాళ భజ్జీలా బౌలింగ్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు