Sergio Perez: సింగపూర్‌ గ్రాండ్‌ప్రి విజేత పెరెజ్‌ 

3 Oct, 2022 13:46 IST|Sakshi

సింగపూర్‌: రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ సెర్జియో పెరెజ్‌ ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో రెండో విజయం సాధించాడు. ఆదివారం జరిగిన సింగపూర్‌ గ్రాండ్‌ప్రిలో పెరెజ్‌ విజేతగా నిలిచాడు. 59 ల్యాప్‌ల ఈ రేసును పెరెజ్‌ అందరికంటే వేగంగా 2గం:02ని.15.238 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని పొందాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన లెక్‌లెర్క్‌ (ఫెరారీ) రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్‌లో 11 విజయాలు సాధించిన వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. తదుపరి రేసు జపాన్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 9న జరుగుతుంది.  

మరిన్ని వార్తలు