విజేత వెర్‌స్టాపెన్‌

10 May, 2022 05:52 IST|Sakshi

మయామి (అమెరికా): ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో ప్రపంచ చాంపియన్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ మూడో విజయం సాధించాడు. అమెరికాలో జరిగిన మయామి గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌ల రేసును వెర్‌స్టాపెన్‌ అందరికంటే వేగంగా గంటా 34 నిమిషాల 24.258 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

ఫెరారీ జట్టు డ్రైవర్లు చార్లెస్‌ లెక్‌లెర్క్‌ రెండో స్థానంలో, కార్లోస్‌ సెయింజ్‌ మూడో స్థానంలో నిలిచారు. లూయిస్‌ హామిల్టన్‌ (మెర్సిడెస్‌)కు ఆరో స్థానం లభించింది. సీజన్‌లో ఐదు రేసులు ముగిశాక లెక్‌లెర్క్‌ 104 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉండగా... వెర్‌స్టాపెన్‌ 85 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు స్పెయిన్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 22న బార్సిలోనాలో జరుగుతుంది.

మరిన్ని వార్తలు