ENG vs PAK: పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌.. ఇంగ్లండ్‌ జట్టు ఇదే! యువ బౌలర్‌ ఎంట్రీ

24 Nov, 2022 11:44 IST|Sakshi

పాకిస్తాన్‌తో చారిత్రాత్మక టెస్టు సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు బెన్‌ స్టోక్స్‌ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా యువ లెగ్‌ స్పిన్నర్‌ రెహాన్ అహ్మద్‌ను ఇంగ్లండ్‌ సెలక్టర్లు ఎంపిక చేశారు. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న అహ్మద్ ఇప్పుడు జాతీయ జట్టు తరపున అరంగేట్రం చేయనున్నాడు.

అతడు పాకిస్తాన్‌పై అరంగేట్రం చేస్తే.. ఇంగ్లండ్‌ తరపున డెబ్యూ చేసిన అతి పిన్న వయస్సుడిగా రికార్డు సృష్టిస్తాడు. కాగా ఈ ఏడాది జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌లోనూ అహ్మద్‌ అదరగొట్టాడు. ఈ మెగా టోర్నీలో కేవలం నాలుగు మ్యాచ్‌లు ఆడిన రెహాన్‌.. 12 వికెట్లు పడగొట్టి సెకెండ్‌ లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు.

ఇక పాకిస్తాన్‌తో టెస్టులకు సీనియర్‌ పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ వ్యక్తిగత కారాణాలతో​ దూరమయ్యాడు. కాగా పాకిస్తాన్‌ పర్యటనలో భాగంగా ఇంగ్లీష్‌ జట్టు మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడనుంది. 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై ఇరు జట్ల మధ్య ఇదే తొలి టెస్టు సిరీస్‌ కావడం గమనార్హం. ఇక డిసెంబర్‌1న రావల్పిండి వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. 

పాకిస్తాన్‌తో టెస్టులకు ఇంగ్లండ్‌ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), జేమ్స్ ఆండర్సన్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, విల్ జాక్స్, కీటన్ జెన్నింగ్స్, జాక్ లీచ్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్‌టన్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్
చదవండి
: ENG vs PAK: 17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. పాక్‌ సీనియర్‌ ఆటగాడు ఎంట్రీ!

మరిన్ని వార్తలు