WPL 2023: వేలంలో ఊహించని ధర.. సెలబ్రేషన్స్‌ మామాలుగా లేవుగా! వీడియో వైరల్‌

14 Feb, 2023 12:34 IST|Sakshi

ముంబై వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో క్రికెటర్లపై కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా భారత క్రికెటర్ల పంటపండింది. భారత స్టార్‌ ఓపెనర్‌  స్మృతి మంధాన రూ.3.4 కోట్ల భారీ ధర దక్కించుకోగా.. దీప్తిశర్మ(రూ.2.6 కోట్లు)  షఫాలీ వర్మ(రూ. 2 కోట్లు), దీప్తి శర్మ(రూ.2.6 కోట్లు), జెమ్మిమా రోడ్రిగ్స్‌(రూ. 2.2కోట్లు), పూజా వస్త్రాకర్‌(రూ.1.9 కోట్లు) సొంతం చేసుకున్నారు.

సెలబ్రేషన్స్‌ మామాలుగా లేవుగా
కాగా భారత మహిళల జట్టు ప్రస్తుతం దక్షిణాఫ్రికా వేదికగా జరగుతోన్న టీ20 ప్రపంచకప్‌లో బీజీ బీజీగా ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన ఈ వేలాన్ని భారత క్రికెటర్లంతా వారు బస చేస్తున్న హాటల్‌లో వీక్షించారు. అయితే ఈ వేలంలో భారత పేసర్‌ రేణుక సింగ్‌కు ఊహించని ధర దక్కడంతో ప్లేయర్స్‌ సెలబ్రేషన్స్‌లో మునిగి తెలిపోయారు.

రేణుక సింగ్‌ను రూ.1.5 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. ఆక్షనర్‌ మల్లికా సాగర్ రేణుక సింగ్‌ను ఆర్సీబీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించిగానే సహాచర క్రికెటర్లు ఆమె చుట్టూ చేరి ఆర్సీబీ, ఆర్సీబీ అంటూ అరుస్తూ సంబురాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండిWPL 2023: బాబర్ కంటే మంధానకి రెండున్నర రెట్లు ఎక్కువ.. పాక్‌ ప్లేయర్లు ఇప్పుడేమంటారో?

మరిన్ని వార్తలు