Asia Cup 2022: శ్రీలంకలో కష్టమే.. యూఏఈ వేదికగా ఆసియా కప్‌..!

17 Jul, 2022 13:17 IST|Sakshi

శ్రీలంక వేదికగా ఆగ‌స్టు 27 నుంచి సెప్టెంబ‌రు 11 వ‌ర‌కు టీ20 ఆసియా క‌ప్ టోర్న‌మెంట్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే శ్రీలంకలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో పాటు రాజకీయ పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉండడంతో.. మరోసారి ఆసియా కప్‌ నిర్వహణపై చర్చ నడుస్తోంది.  తాజా పరిణామాలు ప్రకారం.. శ్రీలంక గడ్డపై జరగాల్సిన ఆసియా కప్‌ను యూఏఈ కు తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఎసిసి) భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి)తో ఆసియా క్రికెట్ కౌన్సిల్ జరిపినట్లు సమాచారం.

"ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శ్రీలంకలో ఆసియాకప్‌ను నిర్వహించడం సరైనది కాదని భావిస్తున్నాం" అని ఎసిసి అధికారి ఒకరు క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్టు పాల్గొనున్నాయి. భారత్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆఫ్గానిస్తాన్‌ ఆర్హత సాధించగా.. మరో స్థానం కోసం హాంకాంగ్, కువైట్, సింగపూర్,యూఏఈ జట్లు క్వాలిఫయర్ రౌండ్‌లో తలపడనున్నాయి.
చదవండిSingapore Open 2022: సింగపూర్ ఓపెన్ విజేతగా పీవీ సింధు.. మూడో భారత ప్లేయర్‌గా..!

మరిన్ని వార్తలు