T20 World Cup 2022: టీమిండియాకు భారీ షాక్‌.. స్టార్‌ బౌలర్‌ దూరం!

14 Apr, 2022 10:48 IST|Sakshi

టీమిండియా పేసర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ గాయం కారణంగా ఐపీఎల్‌-2022కు దూరమైన సంగతి తెలిసిందే. తొడ కండరాల గాయం నుంచి కోలుకున్న చాహర్‌..  బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రాక్టీస్‌ చేస్తుండగా మరో సారి గాయపడ్డాడు. నెట్స్‌లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు అతడి వెన్నెముకకు గాయమైంది.

దీంతో ఈ ఏడాది సీజన్‌లో సీఎస్‌కేకు సెకెండ్‌ హాఫ్‌లో ఎంట్రీ ఇస్తాడనుకున్న చాహర్‌ పూర్తిగా దూరమయ్యాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం..  కనీసం నాలుగు నెలలపాటు క్రికెట్‌కు  దీపక్ చాహర్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నాలుగు నెలలపాటు అతడికి విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం.. ఈ క్రమంలో ఈ ఏడాది ఆక్టోబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు చాహర్‌ అందుబాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఒక వేళ టీ20 ప్రపంచకప్‌కు చాహర్‌ దూరమైతే భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా వంటి ఫాస్ట్‌ ట్రాక్‌ పిచ్‌లపై అద్భుతంగా రాణించే సత్తా చాహర్‌కు ఉంది. ఇక ఐపీఎల్‌-2022 మెగా వేలంలో చాహర్‌ రూ.14 కోట్ల భారీ ధరకు చాహర్‌ను సీఎస్‌కే కొనుగోలు చేసింది. కాగా ప్రస్తుత సీజన్‌లో చాహర్‌ లేని లోటు సీఎస్‌కే బౌలింగ్‌లో సృష్టంగా కన్పిస్తోంది.

చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ చెత్త రికార్డు.. తొలి జట్టుగా!

మరిన్ని వార్తలు