Asia Cup 2022: పా​కిస్తాన్‌తో మ్యాచ్‌.. అవేష్‌ ఖాన్‌కు నో ఛాన్స్‌! భారత యువ పేసర్‌ ఎంట్రీ!

4 Sep, 2022 17:54 IST|Sakshi

ఆసియాకప్‌-2022లో దాయాదుల పోరుకు మరి కొద్ది గంటల్లో తెరలేవనుంది. ఈ మెగా టోర్నీ సూపర్‌-4లో భాగంగా దుబాయ్‌ వేదికగా భారత్‌-పాక్‌ జట్లు ఆదివారం తలపడనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌ లీగ్‌ దశలో పాక్‌ను మట్టికరిపించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

స్టార్‌ ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా గాయం కారణంగా ఆసియా కప్‌ మధ్యలోనుంచి తప్పుకున్నాడు. దీంతో అతడి స్థానంలో స్టాండ్‌బైగా ఉన్న పేస్‌ బౌలర్‌ దీపక్‌ చహర్‌ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మెగా టోర్నీలో దారుణంగా విఫలమవుతున్న అవేష్‌ ఖాన్‌ పక్కన బెట్టి చహర్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజేమెంట్‌ యోచిస్తున్నట్లు సమాచారం.

అదే విధంగా ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌కు ముందు చాహర్‌ నెట్స్‌లో ప్రాక్టీస్‌ కూడా చేస్తున్నాడు. కాబట్టి పాక్‌తో మ్యాచ్‌కు చాహర్‌ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. చాహర్‌ పవర్‌ప్లే కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్‌ చేయగలడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందు గాయపడిన చాహర్‌..  తిరిగి జింబాబ్వే సిరీస్‌తో పునరాగమనం చేశాడు. ఈ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన చాహర్‌  5 వికెట్లతో అదరగొట్టాడు.

A post shared by Deepak Chahar (@deepak_chahar9)


చదవండి: Asia Cup 2022: పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ప్రపంచ రికార్డుకు చేరువలో రోహిత్‌ శర్మ!

మరిన్ని వార్తలు