IPL 2022: ఫైనల్‌కు 6000 ‍మంది పోలీసులతో భారీ భద్రత.. కారణం అదేనా?

29 May, 2022 14:50 IST|Sakshi

ఐపీఎల్‌-2022 తుది సమరానికి రంగం సిద్దమైంది. ఫైనల్‌ పోరులో అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి. కాగా ఫైనల్ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్టేడియానికి రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

దాదాపు 6000 మంది పోలీసులు పహారా కాస్తున్నట్లు తెలుస్తోంది. స్టేడియం దగ్గర "17 మంది డీసీపీలు, 4 డీఐజీలు, 28 ఏసీపీలు, 51 మంది పోలీస్ ఇన్‌స్పెక్టర్లు, 268 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లు, 5,000 మందికి పైగా కానిస్టేబుళ్లు, 1,000 మంది హోంగార్డులు, మూడు కంపెనీల ఎస్‌ఆర్‌పీలు బందోబస్త్‌లో పాల్గొంటారని" అహ్మదాబాద్‌ సిటీ కమిషనర్ సంజయ్ శ్రీవాస్తవ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపారు. ఇక మ్యాచ్‌ను చూసేందుకు 1,25,000 ప్రేక్షకులు రానున్నారు. అయితే ఈ మ్యాచ్‌ ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు మ్యాచ్‌ను చూడనుండటం ప్రపంచ క్రికెట్‌లో ఇదే తొలి సారి.

చదవండి: IPL 2022 Final: అతడిని తుది జట్టు నుంచి తప్పించండి.. అప్పుడే: టీమిండియా మాజీ బ్యాటర్‌

మరిన్ని వార్తలు