FIFA WC 2022: ఖతర్‌లో వరల్డ్‌కప్‌.. ప్రపంచానికి తెలియని మరణాలు!

9 Dec, 2022 10:52 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌ ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటివరకు గ్రూప్‌ దశతో పాటు ప్రీక్వార్టర్స్‌ మ్యాచ్‌లు ముగిశాయి. ఇక క్వార్టర్స్‌లో టాప్‌-8 జట్లు అమితుమీ తేల్చుకోనున్నాయి. క్వార్టర్స్‌  చేరిన వారిలో అర్జెంటీనా, పోర్చుగల్‌, బ్రెజిల్‌, మొరాకో, నెదర్లాండ్స్‌, క్రొయేషియా, ఫ్రాన్స్‌, ఇంగ్లండ్‌లు ఉన్నాయి. ఈ సంగతి పక్కనబెడితే ఫిఫా వరల్డ్‌కప్‌లో మనకు తెలియని ఒక ఆసక్తికర విషయం బయటపడింది.

సాధారణంగా అరబ్‌ దేశాలకు వలస కార్మికులు ఎక్కువగా వస్తుంటారు. అందులో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. అయితే వీరందరిని వరల్డ్‌కప్‌ సందర్భంగా స్టేడియాల నిర్వహణకు ఖతర్‌లోని దోహాకు తరలించారు. అప్పటినుంచి 400 నుంచి 500 మంది వలస కార్మికులు మరణించినట్లు సమాచారం. గార్డియన్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఖతర్‌లో ఫిఫా వరల్డ్‌కప్‌ ప్రాజెక్ట్‌ కోసం ఏడాది క్రితమే దాదాపు 6500 మంది వలస కార్మికులు తీసుకెళ్లారని తెలిపింది. అప్పటినుంచి అక్కడే పనిచేస్తున్న వలస కార్మికుల్లో చాలా మంది చనిపోయినట్లు తెలిసింది.

తాజాగా గురువారం మరో వలస కార్మికుడు మృతి చెందడాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఫిలిపినో అనే సంస్థ ఖతర్‌లో వర్క్‌ సేఫ్టీ ఇన్వెస్టిగేషన్‌ను ప్రారంభించింది. వలస కార్మికుల మరణాలు ఎందుకు జరిగాయదన్న దానిపై నివేదిక అందజేయనుంది. వలస కార్మికుల మృతిపై ఫిఫా విచారం వ్యక్తం చేసింది. వరల్డ్‌కప్‌ నిర్వహణలో తమ ప్రాణాలు అర్పించిన వారందరికి నివాళి అర్పించింది.

ఇక ఫుట్‌బాల్‌ సభ్యత్వం ఉన్న 10 యూరోపియన్‌ దేశాలతో పాటు ఇంగ్లండ్‌ , జర్మనీలు వలస కార్మికుల క్షేమమై ఫిఫాకు లేఖ రాశాయి. ఖతర్‌లోని వలస కార్మికుల హక్కులను మెరుగుపరచడానికి ప్రపంచ పాలకమండలి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది. అదే విధంగా ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌(ILO)కు కూడా యూరోపియన్‌ దేశాలు తమ లేఖను అందజేశాయి.

చదవండి: ఆట గెలవడం కోసం ఇంతలా దిగజారాలా?

FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా?

మరిన్ని వార్తలు