NZ W vs IND W: వన్డేల్లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ.. తొలి భారత క్రికెటర్‌గా!

22 Feb, 2022 14:16 IST|Sakshi

భారత మహిళా క్రికెటర్‌ రిచా ఘోష్‌ వన్డే క్రికెట్‌లో అరుదైన రికార్డును సాధించింది. వన్డేల్లో అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ సాధించిన తొలి భారత మహిళా బ్యాటర్‌గా ఘోష్‌ రికార్డులకెక్కింది. న్యూజిలాండ్‌లో జరిగిన నాలుగో వన్డేలో 26 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన రిచా.. ఈ అరుదైన ఘనత సాధించింది. అంతకుమందు 2018లో దక్షిణాఫ్రికాపై వేదా కృష్ణమూర్తి 32 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించింది.

అదే విధంగా న్యూజిలాండ్‌లో  అత్యంత వేగవంతమైన అర్ధసెంచరీ కూడా రిచాదే కావడం విశేషం. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. భారత జట్టుపై 63 పరుగుల తేడాతో ఘన విజయం న్యూజిలాండ్‌ సాధించింది.  వర్షం​ కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 128  పరగులకే ఆలౌటైంది.

చదవండి: ICC World Cup 2023: టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా అజిత్‌ అగార్కర్‌!?

మరిన్ని వార్తలు