పంత్‌, కార్తీక్‌లు ఇద్దరూ తుది జట్టులో ఉండాలి: గవాస్కర్

20 Oct, 2022 22:29 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌లో పాక్‌తో జరుగబోయే మ్యాచ్‌లో భారత తుది జట్టు కూర్పుపై దిగ్గజ బ్యాటర్‌ సునీల్‌  గవాస్కర్‌ కీలక సూచనలు చేశాడు. భారత ఫైనల్‌ ఎలెవెన్‌లో రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌లు ఇద్దరు ఉండాలని ఆసక్తికర ప్రపోజల్‌తో ముందుకొచ్చాడు. వీరిలో పంత్‌ను ఆరో స్థానంలో, దినేశ్‌ కార్తీక్‌ను ఏడో స్థానంలో ఆడించాలని సూచించాడు. అదే సమయంలో హార్ధిక్‌ పాండ్యాను ఐదో బౌలర్‌గా వినియోగించుకోవాలని సలహా ఇచ్చాడు. 

భారత్.. ఆరో బౌలర్‌ వైపు చూడకుండా పంత్‌, కార్తీక్‌లు ఇద్దరినీ ఆడిస్తే సత్ఫలితం వస్తుందని జోస్యం చెప్పాడు. పంత్‌కు ఆస్ట్రేలియా పిచ్‌లపై మంచి రికార్డు ఉంది కాబట్టి అతన్ని విస్మరించకూడదని, అలాగే డీకేను ఫినిషర్‌ కోటాలో వినియోగించుకోవాలని పేర్కొన్నాడు. మొత్తంగా భారత్‌ నలుగురు స్పెషలిస్ట్‌ బౌలర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్‌, ఐదుగురు బ్యాటర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. 

గవాస్కర్‌ అంచనా వేస్తున్న భారత తుది జట్టు.. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, వన్‌ డౌన్‌లో విరాట్‌ కోహ్లి, నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌, హార్ధిక్‌ పాండ్యా, రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ

Poll
Loading...
మరిన్ని వార్తలు