హోటల్‌ గదిలో రిషబ్‌ పంత్‌ స్టంట్లు

30 Aug, 2020 08:50 IST|Sakshi

ముంబై : మరికొద్దిరోజుల్లో మొదలవ్వబోతున్న ఐపీఎల్‌ 2020కి ఆటగాళ్లందరూ భారీ గానే ప్రిపేర్‌ అవుతున్నారు. ఇన్ని రోజులు నాలుగు గోడల మధ్య మగ్గి క్రికెట్‌ స్టేడియంలో అడుగుపెట్టబోతున్నందుకు మానసికంగా, శారీరకంగా తయారవుతున్నారు. ఢిల్లీ కాపిటల్స్ వికెట్‌ కీపర్‌, బాట్స్‌మ్యాన్‌ రిషబ్‌ పంత్‌ హోటల్‌ రూం స్టంట్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. హోటల్‌ రూం క్వారంటైన్‌లో ఉన్న ఆయన బ్యాక్‌గ్రౌండ్‌లో పాటతో స్టంట్లు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. (మయాంక్, పంత్‌ ఫిఫ్టీల ‘ప్రాక్టీస్‌’)

శనివారం ఆ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు పంత్‌. ‘‘ లాక్‌డౌనే కానీ, ఛార్జ్‌ అవుతున్నా.. రిషబ్‌ పంత్‌.. రిషబ్‌ స్టంట్‌’’ అనే శీర్షికను జోడించారు. కాగా, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌–13 కోసం డీసీ జట్టు కొద్దిరోజుల క్రితమే దుబాయ్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నిబంధనల ప్రకారం ఆటగాళ్లందరూ ఆరు రోజుల క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఎవరికి వారు హోటల్‌ గదికి పరిమితమైపోయారు.

మరిన్ని వార్తలు