Rishabh Pant: ఐసీయూ నుంచి ప్రైవేటు గదికి రిషభ్ పంత్‌.. కారణమిదే?

2 Jan, 2023 18:47 IST|Sakshi

కారు ప్రమాదంలో గాయపడిన టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ వేగంగా కోలుకుంటున్నాడు.  డెహ్రాడూన్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్న అతడిని ప్రైవేట్ సూట్‌ తరలించారు. ఇన్ఫెక్షన్‌ ప్రమాదాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ వెల్లడించారు.

కాగా పంత్‌ను ఆస్పత్రిలో చేరిపించినప్పటి నుంచి శ్యామ్ శర్మ అక్కడే ఉన్నారు.  శ్యామ్ శర్మ ఎన్‌డిటీవీతో మాట్లాడుతూ.. రిషబ్‌ పంత్‌ ప్రస్తుతం బాగానే ఉన్నాడు.  ఇన్ఫెక్షన్ భయంతో ఐసీయూ నుంచి ప్రైవేట్ సూట్‌కి మార్చాము. మేము అతడి కుటుంబానికి,  ఆసుపత్రి నిర్వాహకులకు మేము ఈ విషయం చెప్పాము. అతడు త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని అతడు పేర్కొన్నాడు.

అదే విధంగా పంత్‌ను పరామర్శించేందుకు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి రావద్దని శ్యామ్ శర్మ సూచించారు. ఎక్కువగా విజిటర్లు రావడంతో పంత్‌కు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు శర్మ తెలిపారు. కాగా పంత్‌ పూర్తి స్థాయిలో కోలు కోవడానికి దాదాపు 6 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు స్వదేశంలో జరిగే న్యూజిలాండ్‌ సిరీస్, ఆస్ట్రేలియా సిరీస్‌లతో పాటు ఐపీఎల్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.


చదవండిRishabh Pant: డ్రైవర్‌ను పెట్టుకునే స్థోమత ఉన్నపుడు ఎందుకిలా: టీమిండియా దిగ్గజం

మరిన్ని వార్తలు