పంత్‌ ట్రోలింగ్‌.. వికెట్‌ కోల్పోయిన ఇంగ్లండ్‌

4 Mar, 2021 12:18 IST|Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ నిలకడగా ఆడుతుంది. లంచ్‌ విరామం సమయానికి ఇంగ్లండ్‌ 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 74 పరుగులు చేసింది. బెయిర్‌ స్టో 28, స్టోక్స్‌ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ తాను వేసిన తొలి ఓవర్‌ రెండో బంతికే డొమినిక్‌ సిబ్లీని క్లీన్‌బౌల్డ్‌ చేసి టీమిండియాకు శుభారంభం అందించాడు. అనంతరం మరో ఓపెనర్‌ జాక్‌ క్రాలే కూడా అక్షర్‌ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. అయితే క్రాలే వికెట్‌ను దక్కించుకున్న అక్షర్‌ రిషబ్‌ పంత్‌కు థ్యాంక్స్‌ చెప్పుకోవాలి.

అక్షర్‌ పటేల్‌ వేసిన 7వ ఓవర్‌  నాలుగో బంతిని క్రాలే షాట్‌గా మలచాలనుకొని విఫలమయ్యాడు. బంతి అతని బ్యాట్‌కు తాకకుండా కీపర్‌ పంత్‌ చేతుల్లో పడింది. ''క్రాలే షాట్‌ కొట్టడంలో విఫలమయ్యాడు.. ఇప్పుడు ఇక్కడ ఒకరికి కోపం వస్తుంది.'' అంటూ పంత్‌ పలికిన మాటలు స్టంపింగ్‌ మైక్‌లో రికార్డు అయ్యాయి. పంత్‌ క్రాలేనుద్దేశించి అన్నట్లు అతని మాటల ద్వారా తెలుస్తుంది. కానీ అనూహ్యంగా అదే ఓవర్‌ 5వ బంతికి క్రాలే భారీ షాట్‌కు ప్రయత్నించి సిరాజ్‌కు క్యాచ​ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లండ్‌ రెండో వికెట్‌ కోల్పోగా.. టీమిండియా ముఖంలో ఆనందం వెల్లివెరిసింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

కాగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 2-1తో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఖరి టెస్టు టీమిండియాకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌ను గెలిచినా లేక డ్రా చేసుకున్నా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో అడుగుపెడుతుంది.ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిస్తే ఆ జట్టు చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది. కాగా ఇదే మైదానంలో జరిగిన పింక్‌బాల్‌ టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం విదితమే.
చదవండి: 
1889 తర్వాత మళ్లీ ఇప్పుడే..
వికెట్‌ తీయగానే జెర్సీ విప్పేసిన తాహిర్‌
ప్రాక్టీస్‌కు కొత్త ఫ్రెండ్‌ను తీసుకెళ్లిన పంత్‌

>
మరిన్ని వార్తలు