ధోని దంపతులతో చిల్‌ అయిన పంత్‌

26 Jan, 2021 18:45 IST|Sakshi

రాంచీ: ఆసీస్‌ టూర్‌ తర్వాత టీమిండియా యువ వికెట్ ‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఉత్సాహంగా కనిపిస్తున్నాడు. బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టులో 89*పరుగుల ఇన్నింగ్స్‌తో పంత్‌ ఒక్కసారిగా హీరో అయిపోయాడు. గబ్బా మైదానంలో 32 ఏళ్ల పాటు ఓటమిని ఎరుగని ఆసీస్‌ జైత్రయాత్రకు చెక్‌ పెట్టడంలో కీలకపాత్ర పోషించాడు. పంత్‌ భారత్‌కు తిరిగి రాగానే అభిమానుల నుంచి ఘనస్వాగతం కూడా లభించిన సంగతి తెలిసిందే.

తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని దంపతులతో పంత్‌ చిల్‌ అవుతున్న ఫోటో ఒకటి వైరల్‌గా మారింది. ధోనికి వీరాభిమాని అయిన పంత్‌ అతనితో కలిసి ఎంజాయ్‌ చేసిన మూమెంట్స్‌ను తన కెమెరాలో బంధించాడు. ఈ సందర్భంగా ధోని భార్య సాక్షి ధోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంత్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసింది. ఆ ఫోటోలో ధోని గ్రీన్‌ క్యాప్‌ను ధరించగా.. సాక్షి అతని పక్కనే నిల్చుని వీడియో కాల్‌తో బిజీ అయిపోయారు. వారిద్దరి వెనకాల నిల్చున్న పంత్‌ వీడియోకాల్‌ను ఎంజాయ్‌ చేస్తూ తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు.చదవండి: బెయిర్‌ స్టో ప్రతీకారం.. కానీ ట్విస్ట్‌ ఏంటంటే

కాగా ఆసీస్‌తో సిరీస్‌కు ముందు పంత్‌ ఫాంలో ఉన్నట్లుగా అనిపించలేదు. దానికి తగ్గట్టుగానే రెండో టెస్టులో సాహా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన పంత్‌ బ్యాటింగ్‌, కీపింగ్‌ విభాగంలో దారుణంగా విఫలమయ్యాడు. అయితే మూడో టెస్టులో 97 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో మంచి ఫామ్‌ కనబర్చాడు. నాలుగో టెస్టులో పంత్‌ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్‌ డ్రా అవుతుందా అన్న దశలో పంత్‌ క్రీజులో చివరివరకు నిలబడి 89 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌ ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు.

ఆసీస్‌ 32 ఏళ్ల జైత్రయాత్రకు చెక్‌ పెడుతూ గబ్బా మైదానంలో మ్యాచ్‌ను గెలవడంతో పాటు వరుసగా రెండో ఏడాది 2-1 తేడాతో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోపీ గెలిపించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక టెస్టు సిరీస్‌ చివరికి చూసుకుంటే.. టీమిండియా తరపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా పంత్‌ అగ్రస్థానంలో నిలిచాడు. మొత్తం మూడు టెస్టు మ్యాచ్‌లాడిన పంత్‌ 68 సగటుతో 274 పరుగులు సాధించాడు. కాగా పంత్‌ టీమిండియా తరపున ఇప్పటివరకు 16 టెస్టుల్లో 1088, 16 వన్డేల్లో 374, 28 టీ20ల్లో 410 పరుగులు సాధించాడు.చదవండి:'గిల్‌ తల దించుకొని ఆడితే బాగుంటుంది'

మరిన్ని వార్తలు