రిథమ్‌–అనీశ్‌ జోడీకి స్వర్ణం 

8 Mar, 2022 14:03 IST|Sakshi

కైరో (ఈజిప్ట్‌): ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌ను భారత్‌ స్వర్ణ పతకంతో ముగించింది. టోర్నీ చివరిరోజు సోమవారం భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రిథమ్‌ సాంగ్వాన్‌–అనీశ్‌ భన్వాలా జోడీ పసిడి పతకం సొంతం చేసుకుంది. ఫైనల్లో రిథమ్‌–అనీశ్‌ ద్వయం 17–7తో చవీసా పాదుక–రామ్‌ ఖమాయెంగ్‌ (థాయ్‌లాండ్‌) జంటపై గెలిచింది.

అంతకుముందు జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో అనీశ్, గుర్‌ప్రీత్‌ సింగ్, భావేశ్‌ షెఖావత్‌లతో కూడిన భారత జట్టుకు రజతం దక్కింది. ఫైనల్లో భారత జట్టు 7–17తో జర్మనీ జట్టు చేతిలో ఓడిపోయింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌ నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించి టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది.    

మరిన్ని వార్తలు