Robert Lewandowski: తొమ్మిది నిమిషాల్లో 5 గోల్స్‌.. ఫుట్‌బాల్‌లో కొత్త మొనగాడు

16 Jul, 2022 20:05 IST|Sakshi

ఫుట్‌బాల్‌లో పెను సంచలనం నమోదైంది. బేయర్న్ మ్యూనిచ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆటగాడు రాబర్ట్ లెవాండోస్కీ కొత్త చరిత్ర నమోదు చేశాడు. కేవలం తొమ్మిది నిమిషాల వ్యవధిలో ఐదు గోల్స్‌ కొట్టి ప్రపంచ రికార్డు సాధించాడు. ఈ అద్బుత దృశ్యం జర్మన్‌ క్లబ్‌ వోల్ఫ్స్‌బర్గ్‌, బేయర్‌ మ్యూనిచ్‌ క్లబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. 

ఆట 50, 53, 54, 56, 59వ నిమిషం.. ఇలా 9 నిమిషాల వ్యవధిలోనే రాబర్ట్‌ లెవాండోస్కీ ఐదు గోల్స్‌ కొట్టాడు. ఇందులో 53,54,56 వ నిమిషాలు హ్యాట్రిక్‌ గోల్స్‌ కాగా.. ఓవరాల్‌గానూ 5-గోల్స్‌ హాల్‌ సాధించాడు. ఒక సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా వచ్చి ఈ ఫీట్‌ నమోదు చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత చేశాకా బేయర్న్ మ్యూనిచ్‌ గెలవకుండా ఉంటుందా.

లెవాండోస్కీ జోరుతో గతేడాది ఓటమికి జర్మన్‌ క్లబ్‌ వోల్ప్స్‌ బర్గ్‌పై పనిలో పనిగా ప్రతీకారం తీర్చుకుంది.ఇక లెవాండోస్కీ లాంటి స్ట్రైకర్‌ కోసం అన్ని ఫుట్‌బాల్‌ క్లబ్స్‌ ఎదురుచూస్తున్నాయి. మంచి అటాకింగ్‌ గేమ్‌ కనబరిచే లెవాండోస్కీ.. 'ఫుట్‌బాల్‌లో కొత్త మొనగాడు వచ్చాడంటూ' అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: Tiger Woods: కన్నీటి పర్యంతమైన టైగర్‌వుడ్స్‌

Allyson Felix: మాట నిలబెట్టుకున్న దిగ్గజ అథ్లెట్‌.. కెరీర్‌కు గుడ్‌బై

మరిన్ని వార్తలు