అక్తర్‌ వార్నింగ్‌.. మళ్లీ అలా ఆడేందుకు ధైర్యం చేయలేదు: ఊతప్ప

17 May, 2021 18:05 IST|Sakshi

పాకిస్థాన్ బౌలర్‌ షాయబ్‌ అక్తర్ గతంలో ఒకసారి తనని హెచ్చరించాడని భారత క్రికెటర్ రాబిన్ ఊతప్ప తెలిపాడు. 'వేక్ అప్ విత్ సోరబ్' కార్యక్రమంలో కమెడియన్ సోరబ్ పంత్‌తో మాట్లాడుతూ ఊతప్ప ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. 2007లో పాక్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని చెప్పాడు. ఆ సిరీస్‌లో గువాహటి వన్డే తర్వాత జరిగిన డిన్నర్ సమయంలో అక్తర్ తనతో మాట్లాడిన సంగతిని చెప్పుకొచ్చాడు. 

గువాహటి వన్డేలో.. నేను క్రీజులో ఉన్న సమయానికి  25 బంతుల్లో 12 పరుగులు కావాలి. ఇర్ఫాన్, నేను క్రీజులో ఉన్నాం. ఆ సమయంలో షాయబ్‌ అక్తర్ బౌలింగ్‌ చేస్తున్నాడు. అతనను బంతిని 154 కి.మీ. వేగంతో ఓ యార్కర్ విసిరాడు. దానిని నేను ఆపగలిగాను. ఆ తర్వాత బంతికి మరో యార్కర్‌ ట్రై చేసి ఫుల్ టాస్‌ రావడంతో ఆ బంతిని బౌండరీకి తరలించాను. ఇక అక్తర్‌ తరువాత బంతలను వరుసగా యార్కర్లు వేస్తున్నాడు. ఆ సమయంలో పరుగులు రావలంటే క్రీజు దాటి ఫ్రంట్ ఫుట్‌లో ఆడాలని నిర్ణయించుకున్నా.  తరువాత బంతికి క్రీజు బయటికొచ్చి నా బ్యాట్‌ను తాకించా. అది బౌండరీ వెళ్లింది. మేం ఆ మ్యాచ్‌ను గెలిచాం. 
మ్యాచ్‌ అనంతరం మేము జట్టు సభ్యులతో కలిసి విందు చేస్తున్నట్లు నాకు గుర్తుంది. అక్తర్‌ భాయ్ కూడా అక్కడే ఉన్నాడు. అప్పుడు నా వద్దకు వచ్చి రాబిన్.. ఇవాల్టి మ్యాచ్‌లో క్రీజు దాటి బయటకు వచ్చి ఆడావు. కానీ మళ్ళీ అలా ఆడితే.. నీ తలకి గురిపెడుతూ బౌన్సర్‌ను వేస్తా అని హెచ్చరించి వెళ్లిపోయాడు.  ఆ తరువాత, నేనతని బౌలింగ్‌లో అలా ఆడటానికి  ధైర్యం చేయలేదని ఊతప్ప  తెలిపాడు.

( చదవండి: కెప్టెన్‌ చెప్పిన వాళ్లను ఎంపిక చేయరు.. మా పద్దతి అదే )

మరిన్ని వార్తలు