Roger Federer: 75వ ర్యాంకర్‌ చేతిలో ఓటమి!

19 May, 2021 08:10 IST|Sakshi

జెనీవా: జెనీవా ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో స్విట్జర్లాండ్‌ దిగ్గజం ఫెడరర్‌కు చుక్కెదురైంది. తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్‌ మ్యాచ్‌ ఆడిన ఎనిమిదో ర్యాంకర్‌ ఫెడరర్‌కు 75వ ర్యాంకర్‌ పాబ్లో అందుహర్‌ (స్పెయిన్‌) షాక్‌ ఇచ్చాడు. గంటా 51 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అందుహర్‌ 6–4, 4–6, 6–4తో ఫెడరర్‌ను ఓడించాడు. చివరి సెట్‌లో అందుహర్‌ 2–4తో వెనుకబడి వరుసగా నాలుగు గేమ్‌లు గెలుపొందడం విశేషం.

చదవండి: Serena Williams: 3 నెలల తర్వాత తొలి గెలుపు

మరిన్ని వార్తలు