పురుషుల డబుల్స్‌లో భారత్‌కు దక్కని ‘టోక్యో’ బెర్త్‌

1 Jul, 2021 09:02 IST|Sakshi

న్యూఢిల్లీ: పురుషుల టెన్నిస్‌ డబుల్స్‌ విభాగంలో భారత జోడీ రోహన్‌ బోపన్న–దివిజ్‌ శరణ్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. డబుల్స్‌ కంబైన్డ్‌ ర్యాంకింగ్స్‌లో బోపన్న (38), దివిజ్‌ శరణ్‌ (75) జోడీ 113వ ర్యాంక్‌లో ఉంది. టాప్‌–24 జోడీలకు మాత్రమే టోక్యో బెర్త్‌లు లభిస్తాయి. అనూహ్య పరిణామాలు చోటు చేసుకొని భారీ సంఖ్యలో క్రీడాకారులు వైదొలిగితే తప్ప బోపన్న–దివిజ్‌ జంటకు టోక్యోలో ఆడే అవకాశం లేనట్టే.

1988 సియోల్‌ ఒలింపిక్స్‌ క్రీడల్లో పురుషుల డబుల్స్‌ ఈవెంట్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రతీ ఒలింపిక్స్‌లో పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించారు. పురుషుల డబుల్స్‌లో ఈసారి భారత ప్రాతినిధ్యం లేకపోవడంతో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సానియా మీర్జా బరిలో దిగే చాన్స్‌ లేకుండాపోయింది. సానియా ఇక మహిళల డబుల్స్‌లో మాత్రమే పోటీపడనుంది.

మరిన్ని వార్తలు