Indian Wells Tourney: ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ టోర్నీ ఫైనల్లో బోపన్న జోడీ 

19 Mar, 2023 09:00 IST|Sakshi

ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్‌ కొనసాగిస్తూ భారత డబుల్స్‌ టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న మూడో టోర్నీలో  ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కాలిఫోర్నియాలో జరుగుతున్న ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ ఏటీపీ మాస్టర్స్‌–1000 టోర్నీలో బోపన్న–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) ద్వయం టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్లో బోపన్న–ఎబ్డెన్‌ జోడీ 7–6 (8/6), 7–6 (7/2)తో జాన్‌ ఇస్నెర్‌–జాక్‌ సాక్‌ (అమెరికా) ద్వయంపై గెలుపొందింది.

గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న–ఎబ్డెన్‌ తమ సరీ్వస్‌లో తొమ్మిదిసార్లు బ్రేక్‌ పాయింట్లు కాపాడుకోవడం విశేషం. ఇటీవల దోహా ఓపెన్‌లో బోపన్న–ఎబ్డెన్‌ జంట టైటిల్‌ సాధించగా... రోటర్‌డామ్‌ ఓపెన్‌లో రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. బెంగళూరుకు చెందిన 43 ఏళ్ల బోపన్న ఇప్పటి వరకు కెరీర్‌లో 55 టోరీ్నల్లో ఫైనల్‌కు చేరగా...23 టోరీ్నల్లో టైటిల్స్‌ నెగ్గి, 32 టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచాడు.  

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు