బోపన్న జంట ఓటమి

19 Sep, 2020 02:50 IST|Sakshi

రోమ్‌: ఇటాలియన్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సిరీస్‌–1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్‌ ద్వయం 6–4, 5–7, 7–10తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఫాబ్రిస్‌ మార్టిన్‌–జెరెమీ చార్డీ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. క్వార్టర్‌ ఫైనల్లో ఓడిన బోపన్న జంటకు 30 వేల యూరోలు (రూ. 26 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 180 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. ఇదే టోర్నీ సింగిల్స్‌ విభాగంలో షపోవలోవ్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. మూడో రౌండ్‌లో షపోవలోవ్‌ 6–7 (5/7), 6–1, 6–4తో యుగో హంబర్ట్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచాడు.    

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు