'అతడికి టీ20ల్లో కూడా రాణించే సత్తా ఉంది.. అవకాశం ఇవ్వండి'

30 Sep, 2022 13:13 IST|Sakshi

టీమిండియా యువ బ్యాటర్‌ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గత నెలలో జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో తన తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. అదే విధంగా ఇంగ్లండ్‌ కౌంటీల్లో కూడా గిల్‌ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు. కౌంటీ చాంఫియన్‌ షిప్‌-2022లో గ్లామోర్గాన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్‌.. తన తొలి కౌంటీ క్రికెట్ సెంచరీ కూడా నమోదు చేశాడు.

ససెక్స్‌ క్రికెట్‌ క్లబ్‌పై గిల్‌ మెరుపు సెంచరీ సాధించాడు. దీంతో అతడు ప్రస్తుతం టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారాడు. ఈ క్రమంలో గిల్‌పై మాజీలు, క్రికెట్‌ నిపుణులు ప్రశంసల వర్షం‍ కురిపిస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ ఆటగాడు రోహన్ గవాస్కర్ చేరాడు. గిల్‌ను "ఆల్ ఫార్మాట్ ప్లేయర్" రోహన్‌ అభివర్ణించాడు.

గిల్‌ 'ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌'
"అమోల్ మజుందార్ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో కోచ్‌గా పనిచేస్తున్నప్పుడు.. తొలి సారి గిల్‌ను చూశాడు. అప్పుడే మజుందార్ నాతో చెప్పాడు. రోహన్‌ నేను ఒక అద్భుతమైన ఆటగాడిని ఎన్‌సిఎలో చూశాను అని మజుందార్ చెప్పాడు. గిల్‌ చాలా ప్రతిభాంతుడైన ఆటగాడు. అతడు కచ్చితంగా  మూడు ఫార్మాటల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గిల్‌కు మూడు ఫార్మాటల్లో రాణించే సత్తా ఉంది. అతడు ఆల్‌ ఫార్మాట్‌ ప్లేయర్‌.

టెస్టుల్లో ఇప్పటికే తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు ప్రస్తుతం వైట్ బాల్ క్రికెట్‌లో తన సత్తా చాటడానికి సిద్దమయ్యాడు. అతడి తగినన్ని అవకాశాలు ఇవ్వాలి. అతడు భవిష్యత్తులో భారత సూపర్‌ స్టార్‌ అయ్యే అవకాశం ఉంది" అని స్పోర్ట్స్‌ 18తో గవాస్కర్ పేర్కొన్నాడు.

టెస్టు, వన్డేల్లో ఆకట్టుకున్న గిల్‌
 గిల్‌ ఇప్పటివరకు టెస్టు, వన్డే క్రికెట్‌లో మాత్రమే టీమిండియా తరపున అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 11 టెస్టులు ఆడిన గిల్‌ 579 పరుగులు సాధించాడు. అతడి టెస్టు కెరీర్‌లో నాలుగు హాఫ్‌ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది.

అదే విధంగా ఇప్పటివరకు 9 వన్డేలు ఆడిన గిల్‌.. 499 పరుగులు సాధించాడు. వన్డే కెరీర్‌లో మూడు హాఫ్‌ సెంచరీలు, ఒక సెంచరీ ఉంది. కాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు గిల్‌ ఎంపికయ్యే అవకాశం ఉంది.
చదవండి: T20 WC 2022: ఎంసీజీ నా హోం గ్రౌండ్‌.. భారత బ్యాటర్లు నన్ను తట్టుకోలేరు! అవునా?!

మరిన్ని వార్తలు