ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టారు

5 Oct, 2020 10:30 IST|Sakshi

షార్జా: సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు ఆల్‌రౌండ్‌ షో కనబర్చిందని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నారు. పిచ్‌ నెమ్మదిగా ఉండడంతో అంత స్కోర్‌ చేయడం సులువుకాదని, ముగ్గురు 'హార్డ్‌ హిట్టర్స్‌' తమ జట్టులో ఉండడం అనుకూల అంశమన్నారు. లక్ష్య ఛేదనలో ఆ జట్టును కట్టడి చేయడంలో బౌలర్లు సఫలమయ్యారని మ్యాచ్‌ ముగిసిన తర్వాత అన్నారు.

ముంబై ఇండియన్స్‌ మరోసారి ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టింది. ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గెలిచి పాయింట్స్‌ పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ జట్టుకు క్వింటన్‌ డీకాక్‌ అర్ధ సెంచరీతో మంచి ఆరంభానిచ్చాడు.  చివర్లో వచ్చిన పోలా​ర్డ్‌ 25(13), హర్దిక్‌ పాండ్యా 28(19), కృణల్‌ పాండ్యా 20(5) చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 208 పరుగులు సాధించారు.  
(చదవండి: ముంబై విజయనాదం)

లక్ష్యఛేదనలో విఫలం: వార్నర్‌ 
209 భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభమే లభించింది. వార్నర్‌ ఉన్నంతసేపు ఆ జట్టుకు విజయావకాశాలు కనిపించినా అతడు అవుటయ్యాక ఛేదనలో మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో మంచి పార్టన్‌షిప్‌ లభించలేదని... ముంబైయ ఇండియన్స్‌ బౌలర్లు సమష్టిగా రాణించారని వార్నర్‌ అన్నారు. ఈ మ్యాచ్‌లో తమ బౌలర్ల ప్రదర్శన పేలవంగా ఉందని చివర్లో ఎక్కువగా ఫుల్‌టాస్‌ బంతులు వేశారని వార్నర్‌ అన్నాడు. భువనేశ్వర్‌ గాయంతో ఈ మ్యాచ్‌లో ఆడకపోవడంతో అతడు లేని లోటు మ్యాచ్‌లో కనిపించింది. 
(చదవండి: చెన్నై చిందేసింది)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు