టెస్టు జట్టులో రోహిత్‌.. వన్డే, టీ20లకు రెస్ట్‌

9 Nov, 2020 18:27 IST|Sakshi
రోహిత్‌ శర్మ (ఫైల్‌ఫోటో)

న్యూఢిల్లీ:  త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరే టీమిండియా జట్టులో ఓపెనర్‌ రోహిత్‌ శర్మను చేర్చారు. ముందుగా విడుదల చేసిన భారత క్రికెట్‌ జట్టులో రోహిత్‌ను పక్కకు పెట్టడంతో పెద్ద దుమారం లేచింది. ఫిట్‌నెస్‌ పరంగా రోహిత్‌ బాగానే ఉన్నా అతన్ని ఎందుకు చేర్చలేదనే విమర్శలు వచ్చాయి. దాంతో రివైజ్డ్‌ జట్టును  భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) సెలక్షన్‌ కమిటీ తాజాగా ప్రకటించింది. ఇందులో రోహిత్‌కు చోటు కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. కేవలం టెస్టు జట్టులో మాత్రమే రోహిత్‌కు చోటిచ్చిన సెలక్టర్లు.. వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి ఇచ్చారు.  (అతన్ని వేలంలో ఎవరూ తీసుకోలేదు: గంభీర్‌)

రోహిత్‌తో బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ సంప్రదించిన తర్వాతే అతనికి వన్డే, టీ20లకు రెస్ట్‌ ఇస్తున్నట్లు సెలక్షన్‌ కమిటీ స్పష్టం చేసింది.  రోహిత్‌ ఫిట్‌నెస్‌ను బీసీసీఐ మెడికల్‌ టీమ్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. ఆ క్రమంలోనే సీనియర్‌ సెలక్షన్‌ కమిటీకి నివేదిక అందజేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆరంభం ​కానుంది. డిసెంబర్‌ 8వ తేదీతో పరిమిత ఓవర్ల సిరీస్‌ ముగియనుండగా, డిసెంబర్‌17వ తేదీ నుంచి టెస్టు సిరీస్‌ ప్రారంభం అవుతుంది. మెడికల్‌ రిపోర్ట్‌ ప్రకారం టెస్టు సిరీస్‌ నాటికి రోహిత్‌ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ను సాధిస్తాడని భావించిన సెలక్షన్‌ కమిటీ.. వన్డే, టీ20 సిరీస్‌లకు విశ్రాంతి ఇచ్చింది.

రివైజ్డ్‌ జట్టులో కొన్ని మార్పులు

సంజూ శాంసన్‌- సంజూ శాంసన్‌కు వన్డే జట్టులో కూడా చోటు కల్పించారు. ముందుగా అతని టీ20 జట్టులో స్థానం ఇవ‍్వగా, ఇప్పుడు వన్డే జట్టులో కూడా చోటిచ్చారు.

ఇషాంత్‌ శర్మ- ఇంకా ఇషాంత్‌ కోలుకోలేదు. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఆటగాళ్ల పునరావాస శిబిరంలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇషాంత్‌ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిన తర్వాత భారత టెస్టు జట్టులో చోటు కల్పిస్తారు. 

వరుణ్‌ చక్రవర్తి-భుజం గాయం కారణంగా వరుణ్‌ చక్రవర్తి టీ20 సిరీస్‌ నుంచి ఔటయ్యాడు. అతని స్థానంలో టి నటరాజన్‌కు చోటు దక్కింది.

వృద్ధిమాన్‌ సాహా- నవంబర్‌ 3 తేదీన జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌ తర్వాత సాహా గాయం కారణంగా పలు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. సాహా కోలుకున్న తర్వాత అతని స్థానంపై తుది నిర్ణయం తీసుకుంటారు.

మరిన్ని వార్తలు