IPL 2022: ఆ విషయంలో రిషబ్, రోహిత్, కోహ్లి ముగ్గురూ ఒక్కటే..! 

14 Apr, 2022 16:37 IST|Sakshi

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇప్పటివరకు (ఏప్రిల్‌ 14) జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియాకు చెందిన ముగ్గురు స్టార్‌ క్రికెటర్లు ఓ విషయంలో యాదృచ్చికంగా  ఒకే రకమైన గణాంకాలను కలిగి ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ సారధి రిషబ్‌ పంత్‌, ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లి ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో ఆశ్చర్యకరంగా తలో 81 బంతులనే ఎదుర్కొన్నారు.

రిషబ్‌ పంత్‌ 4 మ్యాచ్‌ల్లో 81 బంతులను ఎదుర్కొని 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేయగా.. హిట్‌మ్యాన్‌ 5 మ్యాచ్‌ల్లో 81 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు స్కోర్‌ చేశాడు. విరాట్‌ 5 మ్యాచ్‌ల్లో 81 బంతులను ఎదుర్కొని 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 107 పరుగులు సాధించాడు. ప్రస్తుత సీజన్‌లో ఈ ముగ్గురు టీమిండియా స్టార్‌ క్రికెటర్లలో ఈ గణాంకాలతో పాటు మరో విషయంలోనూ ఓ కామన్‌ పాయింట్‌ కనబడుతుంది. ఈ ముగ్గురు బ్యాటర్లు ఇంచుమించు ఒకే రకంగా పరుగులు సాధించారు. పంత్‌ 110 పరుగులు సాధించగా, రోహిత్‌ 108, కోహ్లి 107 పరుగులు స్కోర్‌ చేశారు.

వీరిలో రోహిత్‌, పంత్‌ కెప్టెన్సీ భారం కారణంగా పరుగులు సాధించలేకపోగా.. కోహ్లి చాలాకాలంగా తనను ఇబ్బంది పెడుతున్న ఫామ్‌లేమిని కొనసాగించాడు. వ్యక్తిగత గణాంకాల ప్రకారమే కాకుండా జట్టును ముందుండి నడిపించడంలోనూ రోహిత్‌ కంటే పంత్‌ కాస్త మెరుగ్గా కనిపిస్తుండగా, కోహ్లి తన అనుభవంతో ఆర్సీబీకి ఒక్క విజయం కూడా అందించలేకపోయాడు. పంత్‌ నేతృత్వంలో ఢిల్లీ 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో ప్లేస్‌లో ఉండగా, రోహిత్‌ సారధ్యంలో ముంబై ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. విరాట్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్సీబీ 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.  

రోహిత్‌, పంత్‌, కోహ్లి ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌ల్లో గణాంకాలు ఇలా ఉన్నాయి.. 

రోహిత్‌ శర్మ: ఢిల్లీ క్యాపిటల్స్‌పై 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు

రాజస్థాన్‌ రాయల్స్‌పై 5 బంతుల్లో సిక్సర్‌ సాయంతో 10 పరుగులు

కేకేఆర్‌పై 12 బంతుల్లో 3

ఆర్సీబీపై 15 బంతుల్లో 26; 4 ఫోర్లు, సిక్స్‌

పంజాబ్‌పై 17 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు

మొత్తంగా 81 బంతుల్లో 11 ఫోర్లు 6 సిక్సర్ల సాయంతో 108 పరుగులు
===============
రిషబ్‌ పంత్‌: ముంబై ఇండియన్స్‌పై 2 బంతుల్లో 1

గుజరాత్‌ టైటాన్స్‌పై 29 బంతుల్లో 43; 7 ఫోర్లు

లక్నోపై 36 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు

కేకేఆర్‌పై 14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు

మొత్తంగా 81 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లతో 110 పరుగులు
==================
విరాట్‌ కోహ్లి: పంజాబ్‌ కింగ్స్‌పై 29 బంతుల్లో 41 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు

కేకేఆర్‌పై 7 బంతుల్లో 12; 2 ఫోర్లు

రాజస్థాన్‌ రాయల్స్‌పై 6 బంతుల్లో 5

ముంబైపై 36 బంతుల్లో 48; 5 ఫోర్లు

సీఎస్‌కేపై 3 బంతుల్లో 1

మొత్తంగా 81 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 107 పరుగులు
చదవండి: రాజస్థాన్‌తో మ్యాచ్‌.. అరుదైన రికార్డుకు అడుగు దూరంలో ఉన్న రషీద్ ఖాన్

మరిన్ని వార్తలు