Rohit Sharma: యువ క్రికెటర్లకు రోహిత్‌ పాఠాలు.. ఫోటోలు వైరల్‌!

17 Dec, 2021 20:12 IST|Sakshi

Rohit Sharma: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బెంగళూరులో ఉన్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు రోహిత్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గాయం నుంచి కోలుకొనేందుకు నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో రిహాబిలిటేషన్‌ సెంటర్‌కువచ్చాడు. ఇక అక్కడ శిక్షణ పొందుతున్న భారత అండర్‌-19 జట్టుతో రోహిత్‌ శర్మ ముచ్చటించాడు. యూఏఈ వేదికగా డిసెంబర్ 23 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్‌ కోసం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో అండర్‌-19 జట్టు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ అండర్ 19 జట్టుతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సమయంలో యువ ఆటగాళ్లకు రోహిత్‌ విలవైన సూచనలు చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్లో ఎలా రాణించాలో, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి అన్నది ఆటగాళ్లకు రోహిత్‌ తెలియజేశాడు. వైట్ బాల్ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న రోహిత్‌ శర్మ.. తన అనుభవాన్ని ఆటగాళ్లతో పంచకోవడం రానున్న ఆసియా కప్‌లో యువ క్రికెటర్‌లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక దీనికి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. "టీమిండియా వైట్ బాల్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. బెంగళూరులోని ఎన్‌సీఏలో ఉన్న భారత అండర్‌-19 జట్టుతో చాలా సమయాన్ని గడిపాడు. ఈ సమయంలో అతడు చాలా విలువైన సూచనలు చేశాడు" అని బీసీసీఐ రాసుకొచ్చింది. ఇక రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో రోహిత్‌ శర్మతో పాటు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

చదవండి: IND Vs SA: అతడిని కచ్చితంగా భారత జట్టులోకి తీసుకోవాలి.. ఎందుకంటే!

మరిన్ని వార్తలు